- Telugu News Photo Gallery Cricket photos Delhi Capitals Player Jake Fraser McGurk win IPL 2024 TATA Car for best strike rate
IPL 2024 Car Winner: గాయపడ్డోని ప్లేస్‌లో వచ్చాడు.. గట్టిగా దంచేశాడు.. కట్‌చేస్తే.. కార్ పట్టేసిన ఢిల్లీ డైనమేట్
IPL 2024 TATA Car Winner: విశేషమేమిటంటే.. ఈ ఐపీఎల్ వేలంలో జేక్ ఫ్రేజర్‌ను ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేయలేదు. కానీ, IPL ప్రారంభంలో లున్గి ఎన్‌గిడి గాయపడటంతో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జేక్ ఫ్రేజర్‌ను భర్తీ చేసుకుంది. ఇప్పుడు సబ్ స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కు సూపర్ స్ట్రైకర్ అవార్డు రావడం విశేషం.
Updated on: May 27, 2024 | 11:54 AM

IPL 2024 Car Winner: IPL సీజన్ 17 ముగిసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై విజయం సాధించింది.

ఈ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన విరాట్ కోహ్లీ 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా, 24 వికెట్లు తీసిన హర్షల్‌కు పర్పుల్ క్యాప్ లభించింది.

అలాగే ఐపీఎల్ సీజన్‌లో తుఫాన్ బ్యాటింగ్ ప్రదర్శించిన ఆటగాడికి టాటా కారు (లేదా రూ. 10 లక్షలు) ఇస్తారు. అయితే, ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువ ఆటగాడికి ఈ స్పెషల్ అవార్డ్ లభించింది.

సూపర్ స్ట్రైకర్ అవార్డ్‌లో భాగంగా టాటా పంచ్ ఈవీని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ దక్కించుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 9 ఇన్నింగ్స్‌ల్లో జేక్ ఫ్రేజర్ 141 బంతులు ఎదుర్కొని 330 పరుగులు చేశాడు. అది కూడా 234.04 స్ట్రైక్ రేట్‌తో రావడం విశేషం.

దీంతో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ IPL సీజన్ 17 సూపర్ స్ట్రైకర్‌గా అవతరించాడు. ఈ ప్రకారం టాటా పంచ్ EV కారును ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ స్టార్టర్ స్వీకరించారు.

విశేషమేమిటంటే.. ఈ ఐపీఎల్ వేలంలో జేక్ ఫ్రేజర్‌ను ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేయలేదు. కానీ, IPL ప్రారంభంలో లున్గి ఎన్‌గిడి గాయపడటంతో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జేక్ ఫ్రేజర్‌ను భర్తీ చేసుకుంది. ఇప్పుడు సబ్ స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కు సూపర్ స్ట్రైకర్ అవార్డు రావడం విశేషం.





























