T20 World Cup 2024: విండీస్‌కు భారీ ఎదురు దెబ్బ.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. కారణమిదే
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ ముచ్చటగా మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు రాబోయే టీ 20 ప్రపంచ కప్ పైనే ఉంది. జూన్ 2 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ పోటీలు ప్రారంభం కానున్నాయి
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ ముచ్చటగా మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు రాబోయే టీ 20 ప్రపంచ కప్ పైనే ఉంది. జూన్ 2 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 20 జట్లు ప్రపంచకప్ కోసం పోటీ పడనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆడనుంది. ప్రపంచకప్ కోసం టీమిండియా తొలి బ్యాచ్ అమెరికాకు చేరుకుంది. ఇంతలో ఐసీసీ ఓ పెద్ద వార్తను సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులతో పంచుకుంది. అదేంటంటే.. ఆతిథ్య విండీస్ జట్టుకు ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే భారీ షాక్ తగిలింది. విండీస్‌కు చెందిన వెటరన్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియా ద్వారా ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. జాసన్ హోల్డర్ స్థానంలో ఒబెడ్ మకోయ్‌ను జట్టులోకి తీసుకుంది వెస్టిండీస్ జట్టు.
గ్రూప్ సిలో వెస్టిండీస్.. ప్రపంచకప్‌లో వెస్టిండీస్ గ్రూప్ సిలో ఉంది. దీంతో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పపువా న్యూ గినియా, ఉగాండా జట్లు కూడా ఈ గ్రూప్ లోనే ఉన్నాయి. జూన్ 2న పపువా న్యూ గినియాతో విండీస్ తొలి మ్యాచ్ ఆడనుంది.
West Indies dealt with a huge blow ahead of the ICC Men’s #T20WorldCup 2024!https://t.co/zWbfrX2nxx
— ICC (@ICC) May 26, 2024
ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు:
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, ఒబెడ్ మకోయ్, షాయ్ హోప్, అకీల్ హొస్సేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ మరియు రొమారియో షెర్‌ఫోర్డ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..