AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. ఈ సారి బీసీసీఐ ఎన్ని లక్షల మొక్కలు నాటనుందో తెలుసా?

IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు, BCCI ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాకౌట్ మ్యాచుల్లో నమోదైన ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటనున్నట్లు తెలిపింది. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఈ మంచి కార్యక్రమానికి నడుం బిగించినట్లు బీసీసీఐ ప్రకటించింది

IPL 2024: ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. ఈ సారి బీసీసీఐ ఎన్ని లక్షల మొక్కలు నాటనుందో తెలుసా?
IPL 2024
Basha Shek
|

Updated on: May 27, 2024 | 4:56 PM

Share

IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు, BCCI ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాకౌట్ మ్యాచుల్లో నమోదైన ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటనున్నట్లు తెలిపింది. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఈ మంచి కార్యక్రమానికి నడుం బిగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీని కారణంగానే ప్లేఆఫ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఎన్ని డాట్ బాల్స్ ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే నాకౌట్ మ్యాచుల్లో ఎన్ని డాబ్ బాల్స్ పడ్డాయో లెక్కేద్దాం రండి.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో మొత్తం 73 డాట్ బాల్స్ నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇదే మోడీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో మొత్తం 74 డాట్ బాల్స్ పడ్డాయి.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన రెండో క్వాలి ఫైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొత్తం 96 డాట్ బాల్స్ నమోదయ్యాయి.

ఇక ఇదే స్టేడియం వేదికగా ఆదివారం (మే 26) కోల్ కతా నైటర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో మొత్తం 80 డాట్ బాల్స్ వచ్చాయి.

ఐపీఎల్ ట్రోఫీతో రింకూ సింగ్.. వీడియో

అంటే ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నమోదైన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 323. ఇక్కడ ఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లను నాటాలని బీసీసీఐ ప్రకటించింది. ఈ లెక్క ప్రకారంటాటా సంస్థ భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 మొక్కలు నాటనుంది. కాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

కేకేఆర్ ఆటగాళ్లు సంబరాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై