Chiranjeevi: అన్నయ్య రేంజ్ వేరబ్బా! మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవికి ఒక అరుదైన గౌరవం లభించింది.

Chiranjeevi: అన్నయ్య రేంజ్ వేరబ్బా! మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: May 27, 2024 | 9:35 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవికి ఒక అరుదైన గౌరవం లభించింది. సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా దుబాయ్‌ ప్రభుత్వం మెగాస్టార్‌కు గోల్డెన్‌ వీసాను అందించింది. ఈ వీసాతో దుబాయ్ లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసముండొచ్చు. 2019 నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. కాగా చిరంజీవి కంటే ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొణిదెల, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విశిష్ట గౌరవం దక్కించుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

ఇక చిరంజీవి కంటే ముందు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు తారలకు కూడా UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మౌని రాయ్, మోహన్ లాల్ తదితరులు కూడా గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. కాగా చిరంజీవి గొప్ప మనసుకు సంబంధించి తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినిమా సీనియర్ జర్నలిస్టు ప్రభుకు ఆయన ఉచితంగా వైద్యం చేయించారట. గుండె సమస్యలతో బాధపడుతోన్న ఆయనను స్టార్ హాస్పిటల్ లో చేర్పించి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్టంట్ వేయించారట. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ మంచి తనానికి ఇది మరో నిదర్శనమంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?