Guess The Actress: రోడ్డుపై చెత్తను క్లీన్ చేసిన ప్రముఖ నటి.. అభిమానుల ప్రశంసలు.. ఎవరో గుర్తు పట్టారా?

రోడ్డుపై చెత్త పడి ఉంటే మనకెందుకులే అనుకుంటారు చాలా మంది. కనీసం అటు వైపు వెళ్లడానికి కూడా కొందరు ఇష్టపడరు. అయితే ఒక హీరోయిన్ మాత్రం అలా ఆలోచించలేదు. నటి రోడ్డుపై పడి ఉన్న చెత్తనంతటినీ పోగు చేసింది. చేతితోనే పట్టుకుని కొంత దూరంలో ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది

Guess The Actress: రోడ్డుపై చెత్తను క్లీన్ చేసిన ప్రముఖ నటి.. అభిమానుల ప్రశంసలు.. ఎవరో గుర్తు పట్టారా?
Bollywood Actress
Follow us

|

Updated on: May 28, 2024 | 7:12 PM

రోడ్డుపై చెత్త పడి ఉంటే మనకెందుకులే అనుకుంటారు చాలా మంది. కనీసం అటు వైపు వెళ్లడానికి కూడా కొందరు ఇష్టపడరు. అయితే ఒక హీరోయిన్ మాత్రం అలా ఆలోచించలేదు. నటి రోడ్డుపై పడి ఉన్న చెత్తనంతటినీ పోగు చేసింది. చేతితోనే పట్టుకుని కొంత దూరంలో ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సదరు నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కెమెరాలున్నాయని తెలిసే ఆమె చెత్తను క్లీన్ చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ నటి ఎవరో తెలుసా? బాలీవుడ్ డో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్, ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపు పొందిన మలైకా అరోరా. పేరుకు హిందీ నటినే అయినా టాలీవుడ్ తోనూ ఈమెకు పరిచయముంది. పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ లో తన ఎనర్జిటిక్ డ్యాన్స తో అభిమానులతో ఈలలు, కేకలు వేయించింది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉందీ అందాల తార. తన వృత్తి గత జీవితం కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రముఖ నటికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపు పొందిన మలైకా అరోరా ఎప్పటిలాగే జిమ్ కు వెళ్లింది. అప్పుడే జిమ్ పరిసరాల్లోని రోడ్డు పై పడి ఉన్న చెత్తను చూసింది. దీంతో వెంటనే తన చేతులతో వ్యర్థాలన్నింటినీ సేకరించింది. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న డస్ట్ బిన్‌లో పడేసింది. దీనిని చూసిన ఒక నెటిజన్ మలైకాను ప్రశంసిస్తూ, ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి..’ అని మరొక నెటిజన్, ‘మలైకా మా హృదయాలను గెలుచుకుంటుంది..’ అని చెప్పగా, మూడవ నెటిజన్ మాత్రం ‘కెమెరా ముందు ఎవరైనా మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు… ‘ అంటూ ట్రోల్ చేశారు.

ఇవి కూడా చదవండి

మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలైకా తన వృత్తిపరమైన జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. మలైకా గత కొన్నాళ్లుగా నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది.

మలైకా మళ్లీ పెళ్లి చేసుకుంటుందా?

మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో అర్జున్ కపూర్‌తో తనకున్న సంబంధాన్ని మలైకా అధికారికంగా బయట పెట్టింది. అర్జున్ కపూర్, మలైకా అరోరా కూడా చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. సరైన వ్యక్తిని, సరైన సమయంలో కలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని పలు సందర్భాల్లో ప్రకటనలు చేసిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ