- Telugu News Photo Gallery Cinema photos Heroine Samyuktha Menon interesting comments on Tollywood film industry may 2024 Telugu Actress Photos
Samyuktha Menon: అంతా తెలుగు వాళ్లే చేసారు.. అంటున్న సంయుక్త.! కామెంట్స్ వైరల్..
నాకు నచ్చినట్టు నేనుండటంలో ఏముంది? మీకు ఎలా ఉండాలో చెప్పండి... అలా ఉండి చూపిస్తా అని అంటున్నారు నటి సంయుక్త మీనన్. జస్ట్ అలా అనడమే కాదు, తనకు అలా అనమని నేర్పింది టాలీవుడ్ అంటూ క్రెడిట్ మొత్తం తెలుగు జనాలకు ఇచ్చేస్తున్నారు ఈ మల్లు బ్యూటీ. ఇంతకీ సంయుక్త చెబుతున్న విషయం ఏంటి? తెలుగు వాళ్లకు క్రెడిట్ ఎందుకు ఇచ్చినట్టు.? మొన్నటికి మొన్నే టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు సంయుక్త మీనన్.
Updated on: May 28, 2024 | 7:00 PM

చార్మింగ్ ఫేస్, యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ ఎబిలిటీ మెండుగా ఉన్న ఈ బ్యూటీకి సరైన సక్సెస్ ఒకటి పడాలేగానీ, నార్త్ లో ఓ సక్సెస్‌ఫుల్ ట్రిప్ ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. తెలుగులో చేసిన ప్రతి సినిమాకీ పాజిటివ్ బజ్ తెచ్చుకున్నారు నటి సంయుక్త మీనన్.

ఇంతకీ సంయుక్త చెబుతున్న విషయం ఏంటి? తెలుగు వాళ్లకు క్రెడిట్ ఎందుకు ఇచ్చినట్టు.? మొన్నటికి మొన్నే టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు సంయుక్త మీనన్.

మాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో మేకప్ ఎక్కువ వేస్తారని, కొన్నిసార్లు అనీజీగా ఉంటుందని.. చాలా విషయాలనే చెప్పుకొచ్చారు.

ఉన్నదున్నట్టు మాట్లాడుతారనే పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ అన్న మాటలను అప్పట్లో తెలుగువారు కూడా లైట్ తీసుకున్నారు. అలా ఎందుకు మాట్లాడానా అని అనుకున్నారో ఏమోగానీ, ఇప్పుడు సంయుక్త మాటల్లో టాలీవుడ్ మీద ప్రేమ కనిపిస్తోంది.

తాను ఏ భాషలో సినిమా చేసినా, ముందు అక్కడి వర్కింగ్ కల్చర్‌ని తెలుసుకుంటానని అంటున్నారు. ఈ లక్షణాన్ని తనకు నేర్పింది తెలుగు ఇండస్ట్రీ అని అన్నారు మిస్ మీనన్.

ఇన్నాళ్లు సౌత్‌లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్, ఇప్పుడు నార్త్ లో తన లక్ టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ప్రభుదేవా, కాజోల్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు సంయుక్త. దక్షిణాదిన లక్కీ గర్ల్ అనిపించుకున్నట్టే, నార్త్ లోనూ పేరు తెచ్చుకోవాలన్నది సంయుక్త లేటెస్ట గోల్.




