Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా ఆ దిగ్గజ ప్లేయర్ ఖరారు! అధికారిక ప్రకటనే తరువాయి

టీ20 వరల్డ్‌కప్‌ 2024తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో భారత జట్టుకు త్వరలోనే కొత్త కోచ్ రానున్నాడు. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా టీమిండియా కోచ్‌ గా రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా ఆ దిగ్గజ ప్లేయర్ ఖరారు! అధికారిక ప్రకటనే తరువాయి
Team India
Follow us
Basha Shek

|

Updated on: May 28, 2024 | 7:53 PM

టీ20 వరల్డ్‌కప్‌ 2024తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో భారత జట్టుకు త్వరలోనే కొత్త కోచ్ రానున్నాడు. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా టీమిండియా కోచ్‌ గా రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం టీమిండియా దిగ్గజ ప్లేయర్, కేకేఆర్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. అంతకుముందు 2014లో గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి గంభీరే సరైనోడు అని బీసీసీఐ భావించింది. ‌కాగా టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి గడువు (మే 27 చివరి) సోమవారంతో ముగిసింది. మరి ఈ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

అయితే క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉంటాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. కోచ్ పదవికి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్‌ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్‌ చెప్పినట్లు సమాచారం. కాగా ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిశాక గంభీర్‌-జై షా చాలాసేపు బహిరంగంగా మాట్లాడుకోవడం అందరూ చూశారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి పైనే ఈ డిస్కసన్ జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించే విషయమై బీసీసీఐ సమావేశం జరిగినట్లు సమాచారం. కాగా గంభీర్‌ టీమిండియా కోచ్ గా వెళ్లనున్నాడని ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌కు కూడా తెలుసని క్రిక్ బజ్ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!