Raashii Khanna: ఉజ్జయినీ మహా శివుడి భస్మహారతిలో స్టార్ హీరోయిన్స్.. సాధారణ భక్తుల్లా దర్శనం.. వీడియో ఇదిగో

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయం పేరు ఇటీవల తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండడమే ఇందుకు కారణం. గతంలో విరాట్ కోహ్లీ -అనుష్క దంపతులు, కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు, ఉమేష్ యాదవ్, బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్...

Raashii Khanna: ఉజ్జయినీ మహా శివుడి భస్మహారతిలో స్టార్ హీరోయిన్స్.. సాధారణ భక్తుల్లా దర్శనం.. వీడియో ఇదిగో
Raashii Khanna, Vaani Kapoor
Follow us

|

Updated on: May 28, 2024 | 8:37 PM

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయం పేరు ఇటీవల తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శిస్తుండడమే ఇందుకు కారణం. గతంలో విరాట్ కోహ్లీ -అనుష్క దంపతులు, కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు, ఉమేష్ యాదవ్, బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా, గాయకుడు జుబిన్ నౌటియల్, అన్షుమన్ ఖురానా, భారతి, సునీల్ శెట్టి తదితరులు ఇక్కడి మహాకాలేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజాగా ప్రముఖ హీరోయిన్లు రాశీ ఖన్నా, వాణీ కపూర్ ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. మంగళవారం (మే 28) ఉదయం ఈ దేవస్థానానికి చేరుకున్న ఈ అందాల తారలు మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామునే 3 గంటలకు భస్మ హారతి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వీరు సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనం చేరుకున్నారు. ఇక భస్మ హారతి సమయంలో నటీమణులిద్దరూ శివుడిని పఠిస్తూ కనిపించారు. ఆ తర్వాత గర్భ గుడిలోకి వెళ్లి మహాకాలేశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారుల దీవెనలు అందుకున్నారు.

‘ఉజ్జయినీ మహాకాలేశ్వరుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మహాకాల్ మమ్మల్ని మళ్లీ పిలుస్తారని ఆశిస్తున్నాం. ఇది ఒక గొప్ప అనుభూతి’ అని దర్శనానంతరం మీడియాతో చెప్పుకొచ్చారు రాశీ ఖన్నా, వాణీ కపూర్. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి ఆలయంలో రాశీ ఖన్నా, వాణీ కపూర్.. వీడియో

కాగా వాణీకపూర్, రాఖి ఖన్నా ఎప్పటి నుండో మంచి ఫ్రెండ్స్. వాణీ కపూర్ తెలుగులో నానితో కలిసి ఆహా కల్యాణం సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది. ఇక రాశీ ఖన్నా విషయానికి వస్తే.. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.

మీడియాతో మాట్లాడుతోన్న హీరోయిన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ