AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: పెళ్లయ్యాక లుక్ మార్చేసిన బబ్లీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? భర్త కూడా ఓ ప్రముఖ హీరోనే

ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమెకు కేరళ రాష్ట్ర ఉత్తమ బాల నటి అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు హిట్ సినిమాల్లోనటించింది. తన అందం, అభినయంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ ప్రముఖ నటుడిని వివాహం చేసుకుంది.

Guess The Actress: పెళ్లయ్యాక లుక్ మార్చేసిన బబ్లీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? భర్త కూడా ఓ ప్రముఖ హీరోనే
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 29, 2024 | 9:48 PM

Share

పై ఫొటోలో ఉన్నది ఒక మలయాళ హీరోయిన్. అయినా తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. తెలుగులో చేసింది కేవలం ఒక్క సినిమానే అయినా తన క్యూట్ నటనతో ఇక్కడి వారికి బాగా గుర్తుండిపోయింది. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమెకు కేరళ రాష్ట్ర ఉత్తమ బాల నటి అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు హిట్ సినిమాల్లోనటించింది. తన అందం, అభినయంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ ప్రముఖ నటుడిని వివాహం చేసుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కింది. దీంతో అప్పటి నుంచే సినిమాలకు కూడా దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటికి అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో ఆమె ఎంతో క్యూట్ గా కనిపించింది. పెళ్లి సమయంలో చాలా లావుగా ఉందని విమర్శలు ఎదుర్కొన్న ఈ సొగసరి పెళ్లయ్యాక మాత్రం తన లుక్ ను పూర్తిగా మార్చేసింది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? ఈ సొగసరి తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఒక సినిమా చేసింది. ఆమె తెలుగులో నటించిన ఏకైక సినిమా ఇదే. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆమె ఎవరో అని.. యస్. ఈ ముద్దు గుమ్మ ఎవరో కాదు.. సాహసం శ్వాసగా సాగిపో హీరోయిన్ మంజిమా మోహన్.

కాగా మంజిమా మోహన్‌ కోలీవుడ్ హీరో గౌతమ్‌ కార్తిక్‌ను పెళ్లిచేసుకుంది. 2022లో వీరి వివాహం గ్రాండగా జరిగింది. 2019లో ‘దేవరత్తం’ అనే సినిమాలో మంజిమా, కార్తీక్ కలసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం మొదలైంది. అది కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. దీంతో ఇరు పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండి

పెళ్లయ్యాక మంజిమా మోహన్ సినిమాలకు దూరంగా ఉంది. ఇక ఆమె భర్త కార్తీక్ మాత్రం అడపా దడపా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. కడలి సినిమాతో కార్తీక్ తెలుగు వారికి కూడా పరిచయమయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!