- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal says that she likes these three directors a lot
Kajal Aggarwal: కాజల్‌కు ఆ ముగ్గురు చాలా ప్రత్యేకమట.. ఎందుకో తెలుసా..
అందాల భామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ చిన్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు.
Updated on: May 29, 2024 | 9:18 PM

అందాల భామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ చిన్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు.

పెళ్లి తర్వాత ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణిస్తుంది కాజల్ అగర్వాల్. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

అలాగే ఇప్పుడు సత్యభామ అనే సినిమా చేస్తుంది కాజల్ అగర్వాల్, ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది.

తాజాగా కాజల్ ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. తనకు ముగ్గురు దర్శకులు అంటే చాలా ఇష్టమని తెలిపింది. తన కెరీర్ ను తేజ దర్శకత్వంలో మొదలు పెట్టింది కాజల్.

లక్ష్మీ కళ్యాణం, నిన్నే రాజు నేనే మంత్రిఎం సీత సినిమాలు చేసింది. అలాగే దర్శకుడు రాజమౌళి తనకు మొదటి సారి మగధీర రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అలాగే కమర్షియల్ గా తనకు గుర్తింపు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో వచ్చింది. అందుకే ఈ ముగ్గురు దర్శకులు తనకు ఎంతో ప్రత్యేకం అని తెలిపింది.




