- Telugu News Photo Gallery Cinema photos Team India's Yuzvendra Chahal And Dhanashree Verma Expecting Their First Child Says Reports
Yuzvendra Chahal: తండ్రి కానున్న టీమిండియా క్రికెటర్ చాహల్.. భార్య ధనశ్రీ వర్మ ఫొటోస్ వైరల్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడా? అతని సతీమణి ధన శ్రీ వర్మ ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ధన శ్రీ వర్మ ధరించిన డ్రెస్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాహల్ దంపతులు త్వరలోనే అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారని టాక్ వినిపిస్తోంది.
Updated on: May 29, 2024 | 5:45 PM

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడా? అతని సతీమణి ధన శ్రీ వర్మ ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ధన శ్రీ వర్మ ధరించిన డ్రెస్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాహల్ దంపతులు త్వరలోనే అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ ఫొటోల్లో ధనశ్రీ వర్మ మెటర్నీటీ దుస్తుల తరహాలో వదులైన డ్రెస్ వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో సహజంగానే ప్రెగ్నెన్సీ రూమర్లు తలెత్తాయి.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు యుజువేంద్ర చాహల్. దీంతో అతను తండ్రి అవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే దీనిపై చాహల్ కానీ, ధన్‌శ్రీ వర్మ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ధనశ్రీ వర్మ ప్రెగ్నెన్సీ వార్తలు మాత్రం నెట్టింగ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

2020లో, యుజ్వేంద్ర చాహల్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో వివాహం చేసుకున్నారు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ధన శ్రీ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వస్తున్నాయి. దీనినే తన డ్రెస్ ద్వారా ఆమె హింట్ ఇచ్చిందని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా వెళ్లాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చాహల్ ప్రధాన స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో చాహల్ కూడా టీమిండియా తరఫున ఆడవచ్చు.