- Telugu News Photo Gallery Cinema photos Bollywood Heroine Ananya Panday Career Movies Updates on May 2024 Telugu Actress Photos
Ananya Panday: లైగర్ బ్యూటీ అనన్య పాండే కెరీర్ లో ఏం జరుగుతోంది.?
సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగా దొరికింది కదా అని, కెరీర్ కూడా నల్లేరు మీద నడకలా ఉండదు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వెళ్తున్న రూట్ కరెక్టో కాదో, చెక్ చేసుకోవాలి. ఎదగాలంటే బోలెడంత కష్టపడాలి. అలా కాకపోతే బంగారంలాంటి భవిష్యత్తు... జస్ట్ అలా అలా సాదాసీదాగా మారిపోతుంది. ఈ విషయాన్ని అనన్యకు చెప్పేవాళ్లు లేరా? లైగర్ బ్యూటీగా మన అందరికీ బాగా పరిచయం అనన్య పాండే.
Updated on: May 29, 2024 | 4:20 PM

సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగా దొరికింది కదా అని, కెరీర్ కూడా నల్లేరు మీద నడకలా ఉండదు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వెళ్తున్న రూట్ కరెక్టో కాదో, చెక్ చేసుకోవాలి.

ఎదగాలంటే బోలెడంత కష్టపడాలి. అలా కాకపోతే బంగారంలాంటి భవిష్యత్తు... జస్ట్ అలా అలా సాదాసీదాగా మారిపోతుంది. ఈ విషయాన్ని అనన్యకు చెప్పేవాళ్లు లేరా? లైగర్ బ్యూటీగా మన అందరికీ బాగా పరిచయం అనన్య పాండే.

నార్త్ లో అప్పుడప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన ఈ బ్యూటీకి ప్యాన్ ఇండియా సినిమాలో రౌడీబోయ్ పక్కన ఛాన్స్ ఇచ్చి మంచి హెల్పే చేశారు పూరి జగన్నాథ్.

లైగర్ ఫ్లాప్ కావడంతో అంత పెద్ద అవకాశాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయారు ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా నార్త్ లో ఈ బ్యూటీ పెద్దగా కెరీర్ మీద దృష్టిపెట్టలేదన్నది క్రిటిక్స్ చెబుతున్న మాట.

కెరీర్‌లో ఎర్లీ స్టేజెస్‌లోనే ప్రేమలో పడి, ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆదిత్య రాయ్ కపూర్‌తో బ్రేకప్ అయ్యాకనే ఈ భామ కాస్త సినిమాల మీద ఫోకస్ పెంచుతున్నారంటోంది ముంబై మీడియా.

థియేట్రికల్ రిలీజులతో పోలిస్తే, ఓటీటీ స్టఫ్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు అనన్య. ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ 2 మంచి హిట్ అయింది.

అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకుని మరిన్ని మంచి అవకాశాలను పట్టుకునే ప్రయత్నం చేయలేదన్నది అనన్య మీద ఉన్న మేజర్ కంప్లయింట్.

సో.. ఇప్పటికైనా పర్ఫెక్ట్ ప్రాజెక్టులను చూజ్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు లైగర్ లేడీ ఫ్యాన్స్.




