AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. కాళ్లు మొక్కిన అభిమానికి సర్జరీ చేయిస్తానని మాటిచ్చిన ధోనీ

అభిమానులు లెజెండ్, స్టార్ క్రికెటర్ అనే ట్యాగులు తగిలించినా ఎంతో సింపుల్ గా, సైలెంట్ గా ఉండడం ధోని లోని ప్రత్యేకత. అందుకే అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ధోని ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మ్యాచులను చూస్తే ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. ఇంకా పెరుగుతూనే ఉందని ఇట్టే అర్థమై పోతుంది.

MS Dhoni: 'నేను విన్నాను.. నేను ఉన్నాను'.. కాళ్లు మొక్కిన అభిమానికి సర్జరీ చేయిస్తానని మాటిచ్చిన ధోనీ
MS Dhoni
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: May 30, 2024 | 10:15 AM

Share

మహేంద్ర సింగ్‌ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు ఉన్న ప్రాధాన్యం, క్రేజ్ వేరు. మైదానంలో అప్పటికప్పుడు చురుకైన నిర్ణయాలు తీసుకుంటూ టీమిండియాకు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు మిస్టర్ కూల్. అభిమానులు లెజెండ్, స్టార్ క్రికెటర్ అనే ట్యాగులు తగిలించినా ఎంతో సింపుల్ గా, సైలెంట్ గా ఉండడం ధోని లోని ప్రత్యేకత. అందుకే అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ధోని ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మ్యాచులను చూస్తే ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. ఇంకా పెరుగుతూనే ఉందని ఇట్టే అర్థమై పోతుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగానూ ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుది. ధోని బ్యాటింగ్ కు రాగానే సదరు అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్ లోక వచ్చేశాడు. డైరెక్టుగా ధోని దగ్గరకు వెళ్లి అతని పాదాలను చుట్టేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే నిరాడంబరతకు మారుపేరైన ధోని ఏ మాత్రం సహనం కోల్పేదు. తన అభిమానిని హత్తుకున్నాడు. అతని సమస్యను ఓపికగా విన్నాడు. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాలను ఓ వీడియో రూపంలో వెల్లడించాడు.

ధోనితో సంభాషణ వివరాలను వెల్లడిస్తోన్న అభిమాని..

‘ గ్రౌండ్ లో ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. అందుకే మైదానంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాను. మహీ భాయ్‌ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు. ఆయనను చూసిన ఆనందంలో నాకేం మాట్లాడాలో తోచలేదు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. నేరుగా ఆయనను చూసేసరికి నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో నేను కష్టంగా ఊపిరి తీసుకోవడం ధోని గమనించారు. వెంటనే ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. వెంటనే ఆయన ‘ బాధ పడకు.. నీ ఆపరేషన్ గురించి నేను చూసుకుంటా.. నీకేం కానివ్వనని మాట ఇచ్చారు’ అని చెప్పుకొచ్చాడు సదరు అభిమాని. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ధోని మంచి మనసుకు ఇది మరో నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ధోని కాళ్లు మొక్కుతున్న అభిమాని.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..