Actress: వయ్యారాలు పోతోన్న ఈ సీనియర్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 50 ఏళ్లకు దగ్గరైనా ఏమాత్రం తగ్గని అందం

మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో ఆడి పాడింది. ఈ సొగసరి స్పెషాలిటీ ఏంటంటే.. 50 ఏళ్లకు దగ్గరైనా ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపున్న ఈమె ఫిట్‌నెస్ కు తెగ ప్రాధాన్యమిస్తుంది. నిత్యం జిమ్ లో కసరత్తులు, వర్కవుట్లు చేస్తుంటుంది.

Actress: వయ్యారాలు పోతోన్న ఈ సీనియర్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 50 ఏళ్లకు దగ్గరైనా ఏమాత్రం తగ్గని అందం
Bollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: May 30, 2024 | 7:19 PM

పై ఫొటోలో ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని వయ్యారాలు పోతోన్న ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా? పేరుకు బాలీవుడ్ నటి అయినప్పటికీ టాలీవుడ్‌తోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో ఆడి పాడింది. ఈ సొగసరి స్పెషాలిటీ ఏంటంటే.. 50 ఏళ్లకు దగ్గరైనా ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపున్న ఈమె ఫిట్‌నెస్ కు తెగ ప్రాధాన్యమిస్తుంది. నిత్యం జిమ్ లో కసరత్తులు, వర్కవుట్లు చేస్తుంటుంది. అంతేకాదు వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో! యస్ ఈ బ్యూటీ మరెవరో కాదు సాహస వీరుడు సాగర కన్య మూవీ ఫేమ్ శిల్పా శెట్టి. ప్రస్తుతం ఈమె కన్నడ సినిమా కేడీలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోంది. ‘కెడి’ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది . ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడంతో కొబ్బరి కాయ కొట్టేశారు. దీంతో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. శిల్పా శెట్టి కూడా చివరి రోజు షూటింగ్ సెట్ నుంచి ఒక వీడియోను పంచుకుంది. ఇందులో కేడీ సినిమా దర్శకుడు ‘జోగి’ ప్రేమ్‌తో సహా మొత్తం చిత్ర బృందంతో శిల్పాశెట్టి సంతోషంగా పోజులిచ్చింది .

ధృవ్ సర్జా హీరోగా నటిస్తున్న చిత్రం ‘కెడి’. ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టులు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రలు పోషించారు. శిల్పాశెట్టి పాత్ర పేరు సత్యవతి. తనకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి అని చెబుతోంది శిల్ప. ఇలా పేరున్న యాక్టర్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ‘కెడి’ సినిమా రెట్రో కథతో రూపొందనుంది. దానికి తగ్గట్టుగానే కళాకారుల వేషధారణ ఉంటుంది. కొన్ని నెలల క్రితం శిల్పాశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ఆమె చీర గెటప్‌లో కనిపించింది. షూటింగ్ చివరి రోజు కూడా అదే గెటప్‌లో దర్శనమిచ్చింది. షూటింగ్ పూర్తయిందన్న ఆనందంలో ఈ వీడియోను షేర్ చేసిందీ అందాల తార. కాగా చాలా ఏళ్ల తర్వాత ‘కెడి’ సినిమా ద్వారా కన్నడలోకి రీఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాతో . కేడీ మూవీ కన్నడతో పాటు వివిధ భాషల్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

కెడి’ సినిమా షూటింగ్ విరామంలో శిల్పాశెట్టి ఇటీవల నంజన్‌గూడ్‌లోని నంజుడేశ్వర్ ఆలయాన్ని సందర్శించింది. దేవుడికి పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో కూర్చుని ధ్యానం చేసింది. ఈ సందర్భంగా తీసిన వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ‘కెడి’ సినిమా విడుదల కానుంది. రవిచంద్రన్, రమేష్ అరవింద్ వంటి ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.