Prabhas : ప్రభాస్ చేసిన ఫస్ట్ ఇన్‌స్టా రీల్ ఎదో తెలుసా..? డార్లింగ్ భలే చేశాడు
పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు. విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. జపాన్ లాంటి దేశంలో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఏర్పడింది. సాహో సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. చివరిగా ప్రభాస్ సలార్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాలంటే ముందు ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరో.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు. విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. జపాన్ లాంటి దేశంలో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఏర్పడింది. సాహో సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. చివరిగా ప్రభాస్ సలార్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన సినిమాకు సంబందించిన విశేషాలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు డార్లింగ్. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో రీల్ చేసిన విషయం ఎవరికైనా తెలుసా.? అవును ప్రభాస్ కూడా ఇన్ స్టాలో ఓ రీల్ చేశాడు. వేరే హీరో డైలాగ్ కు వీడియో చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభాస్ కు పూరిజగన్నాథ్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న విషయంతెలిసిందే. పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ప్రభాస్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆ మధ్య ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమాకోస ప్రభాస్ హీరో, హీరోయిన్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలోని ఓ డైలాగ్ ను ఆకాష్ తో కలిసి రీల్ చేశాడు ప్రభాస్. “పుట్టింది పడుకోడానికి కాదు బే.. పోయాక పాడుకోరా ఎవడడిగాడు” అనే డైలాగ్ ను రీల్ చేశాడు ప్రభాస్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్న చేసిన ఫస్ట్ రీల్ అంటూ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు డార్లింగ్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.