Sabari OTT: ఓటీటీలోకి వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్.. శబరి స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

వర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా శబరి. అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలోగ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌, శ‌శాంక్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ ఆసక్తిగా ఉండడం, ప్రమోషన్లు గట్టిగానే నిర్వహిండంతో శబరి సినిమాపై అంచనాలు పెరిగాయి

Sabari OTT: ఓటీటీలోకి వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్.. శబరి స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Sabari Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 03, 2024 | 6:51 AM

వర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా శబరి. అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలోగ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌, శ‌శాంక్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ ఆసక్తిగా ఉండడం, ప్రమోషన్లు గట్టిగానే నిర్వహిండంతో శబరి సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే మే 3న విడుదలైన ఈ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. దీనికి తోడు బరిలో పలు సినిమాలు ఉండడం శబరి సినిమాకు మైనస్ గా మారింది. అయితే శ‌బ‌రి సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ యాక్టింగ్‌ బాగుందని ప్రశంసలు వచ్చాయి. అలాగే క‌థ‌లోని కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయ‌నే కామెంట్స్ వచ్చాయి. ఇలా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన శబరి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో జూన్ 14న శ‌బ‌రి మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే శబరి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వ‌చ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.

మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ నిర్మించిన శబరి సినిమాలో మైమ్ గోపి, మధునందన్, సునైనా, కేశవ్, రాజర్షి, అశ్రిత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. సినిమాటోగ్రాఫర్ గా రాహుల్ శ్రీ వాస్తవ, నాని వ్యవహరించారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. సినిమా కథ విషయానికి వస్తే.. సంజ‌న (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) పెద్ద‌ల‌ను కాదని అర‌వింద్‌ను (గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌) ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. అయితే అర‌వింద్ జీవితంలో మ‌రో అమ్మాయి ఉంద‌నే నిజం తెలిసి భ‌ర్త‌కు దూరంగా కూతురు రియాతో (బేబీ నివేక్ష‌) కలిసి జీవిస్తుంది.లాయ‌ర్ రాహుల్ (శ‌శాంక్‌) స‌హాయంతో జుంబా ట్రైన‌ర్‌గా ఉద్యోగంలో చేరుతుంది. అయితే సంజన కోసం సూర్య (మైమ్ గోపి) అనే క్రిమినల్ తెగ వెతుకు తుంటాడు. అయితే పోలీసుల విచారణంలో అతను చనిపోయినట్లు తెలుస్తోంది. మరి అసలు సూర్య ఎవరు? సంజన కోసం ఎందుకు వెతుకుతు్నాడు? అరవింద్ బారి నుంచి సంజన తన కూతురును ఎలా కాపాడుకుంది అన్నదే శబరి సినిమా కథ.

ఇవి కూడా చదవండి

శబరి సినిమాలో వరలక్ష్మి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి