AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: హార్దిక్ పాండ్యా పవర్ ఫుల్ షాట్.. కట్ చేస్తే బంగ్లా బౌలర్ చేతికి ఆరు కుట్లు.. వీడియో

టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. శనివారం (జూన్ 1) భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం చేతికి తీవ్ర గాయమైంది. అతని చేతికి ఆరు కుట్లు కూడా పడ్డాయని సమాచారం

T20 World Cup 2024: హార్దిక్ పాండ్యా పవర్ ఫుల్ షాట్.. కట్ చేస్తే బంగ్లా బౌలర్ చేతికి ఆరు కుట్లు.. వీడియో
Shoriful Islam, Hardik pandya
Basha Shek
|

Updated on: Jun 05, 2024 | 10:17 AM

Share

టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. శనివారం (జూన్ 1) భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం చేతికి తీవ్ర గాయమైంది. అతని చేతికి ఆరు కుట్లు కూడా పడ్డాయని సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన షోరీఫుల్ కోలుకోవడానికి కనీసం వారం రోజులు పడుతుందని అంచనా. అంటే జూన్ 7న శ్రీలంకతో బంగ్లాదేశ్ ప్రారంభ మ్యాచ్‌లో అతను ఆడలేడు. భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన షోరీఫుల్ 3.5 ఓవర్లలో 26 పరుగులు చేసి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు అతని గాయంతో బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే. వివరాల్లోకి వెళితే.. నసావు కౌంటీ స్టేడియంలో శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో షోరీఫుల్ గాయపడ్డాడు. చివరి ఓవర్ వేయడానికి వచ్చిన షోరీఫుల్ ఐదో బంతికి యార్కర్ వేశాడు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను స్ట్రెయిట్ షాట్‌ తో ఈ యార్కర్‌ బంతిని బలంగా బాదాడు. దీనిని దానిని షోరీఫుల్ తన అరచేతితో ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో బంతి వేగంగా వచ్చి అతని చేతికి తగిలింది. దీంతో షోరీపుల్ బాధతో విలవిల్లాడిపోయాడు. వెంటనే మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన రిపోర్టుల ప్రకారం, షోరీఫుల్ చేతి వేలికి, అరచేతికి మధ్య 6 కుట్లు పడ్డాయి.

బంగ్లాదేశ్ పేస్ అటాక్‌లో ముస్తాఫిజుర్ రెహమాన్, తంజీమ్ షకీబ్, తస్కిన్ అహ్మద్‌లతో పాటు షోరీఫుల్ ఇస్లాం కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే అతని గాయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ఏమీ చెప్పలేదు. గాయం నుంచి త్వరగా కోలుకోకుంటే బంగ్లాదేశ్ జట్టుకు ఎదురుదెబ్బ తప్పదు. ఎందుకంటే తస్కిన్ అహ్మద్ కూడా పూర్తి ఫిట్‌గా లేడు. బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ మహమూద్‌ కూడా రిజర్వ్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. షోరీఫుల్ కోలుకోకపోతే హసన్ మహమూద్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది

బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 182 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, పాండ్యా 23 బంతుల్లో 40 పరుగులు చేశారు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా 18 బంతుల్లో 30 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ లో మెరిసిన అర్ష్ దీప్ సింగ్ 3 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..