- Telugu News Photo Gallery Cinema photos Rashmika To Sai Pallavi, Do You Know Education Qualifications Of These Famous Actresses
Tollywood: ఆ స్టార్ హీరోయిన్‌కు ఏకంగా మూడు బ్యాచిలర్ డిగ్రీలు.. మన అందాల తారల చదువులేంటో తెలుసా?
. 'డాక్టర్ అవ్వాల్సింది.. యాక్టర్ అయ్యాను'... మన సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు చాలా మంది చాలా తరచుగా చెప్పే మాట ఇది. అలాగే అందాల తారలు, వారి చదువులు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మరి ఎవరెవరు ఏం చదువు కున్నారో, ఎందుకు సినిమా ఫీల్డ్ లోకి అడుగు పెట్టారో తెలుసుకుందాం రండి.
Updated on: Jun 01, 2024 | 9:53 PM

'డాక్టర్ అవ్వాల్సింది.. యాక్టర్ అయ్యాను'... మన సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు చాలా మంది చాలా తరచుగా చెప్పే మాట ఇది. అలాగే అందాల తారలు, వారి చదువులు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మరి ఎవరెవరు ఏం చదువు కున్నారో, ఎందుకు సినిమా ఫీల్డ్ లోకి అడుగు పెట్టారో తెలుసుకుందాం రండి.

తన అందం, అభినయంతో టాలీవుడ్ ను ఏలిన సమంత కామర్స్‌లో డిగ్రీ చేసింది. చదువుల్లో మంచి టాపర్ కూడా. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునేదట.

ఇక న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి టీబీలీసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో తన ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసింది. హీరోయిన్ కాకపోయి ఉంటే.. డాక్టర్ అయిపోయేదాన్ని అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న రష్మిక మందన్నా ఏకంగా మూడు డిగ్రీలు చేసిందట. సైకాలజీ, జర్నలిజం, అలాగే ఇంగ్లీష్ లిటరేచర్ లో కూడా బ్యాచిలర్ డిగ్రీ అందుకుందీ అందాల తార.

ఇక దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోన్న లేడీ సూపర్ స్టార్ నయన తార ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పొందింది.

ఇక పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ కు జర్నలిజంలో డిగ్రీ ఉంటే, శ్రుతి హాసన్ సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.




