- Telugu News Photo Gallery Cinema photos Kollywood exhibitors are closing down the theaters because of no new movies
Tamil Movies: కోలీవుడ్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? అదే కారణమా.?
మనమే అనుకుంటే మనకంటే దారుణంగా మారిపోయింది తమిళ ఇండస్ట్రీ పరిస్థితిప్పుడు. కాలం కలిసిరాకపోతే అరటిపండు తిన్నా.. పన్ను ఇరుగుద్దంటారు కదా..? కోలీవుడ్‌కు అచ్చు గుద్దినట్లు సెట్ అవుతుంది ఈ సామెత. కొత్త సినిమాల్లేక.. వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లేక.. థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. అసలు ఉన్నట్లుండి కోలీవుడ్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..?
Updated on: Jun 02, 2024 | 6:00 AM

గత రెండేళ్లుగా విక్రమ్, పొన్నియన్ సెల్వన్, జైలర్, లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన కోలీవుడ్‌కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. జైలర్, లియోలతో థియేటర్స్ హౌజ్ ఫుల్స్ అయ్యాయి.

ఆ తర్వాత ఆ రేంజ్ ఫీడింగ్ థియేటర్స్‌కు లేదు. సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్ సినిమాలతో వచ్చినా కూడా ఏదో ఓకే అనిపించాయే తప్ప.. బ్లాక్‌బస్టర్స్ అయితే కాదు.

సమ్మర్‌కు వస్తాయనుకున్న సూర్య, విక్రమ్, అజిత్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. భారీ సినిమాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావు కబురు చల్లగా చెప్పారు నిర్మాతలు.

అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 సైతం జులై 12న విడుదల కానుంది. అజిత్, విజయ్, రజినీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్‌పైనే ఉన్నాయి. ఈ టైమ్‌లో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు.

తమిళంతో పోలిస్తే టాలీవుడ్ కాస్త బెటర్. మన దగ్గర కల్కి, పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్, ఓజి అంటూ 2024లో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం. కానీ అక్కడ ఇండియన్ 2 తప్పిస్తే.. ఏ సినిమా కనిపించట్లేదు. కంగువా, తంగలాన్ ఇంకా డేట్ చెప్పలేదు. విజయ్ గోట్ మాత్రమే ఈ ఏడాది రానుంది. మొత్తానికి స్టార్స్ వచ్చేవరకు థియేటర్స్‌లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయిప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు.




