T20 World Cup 2024: సింగ్ ఈజ్ కింగ్.. అర్షదీప్ సూపర్బ్ డెలివరీకి వికెట్లు చెల్లా చెదురు.. వీడియో వైరల్

టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రధాన టోర్నీకి ముందు భారత జట్టు ఆత్మ విశ్వాసం కూడ గట్టుకుంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సమిష్ఠిగా రాణించారు. న్యూయర్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది.

T20 World Cup 2024: సింగ్ ఈజ్ కింగ్.. అర్షదీప్ సూపర్బ్ డెలివరీకి వికెట్లు చెల్లా చెదురు.. వీడియో వైరల్
Arshdeep Singh
Follow us
Basha Shek

|

Updated on: Jun 02, 2024 | 6:09 PM

టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రధాన టోర్నీకి ముందు భారత జట్టు ఆత్మ విశ్వాసం కూడ గట్టుకుంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సమిష్ఠిగా రాణించారు. న్యూయర్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఖరులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 40(నాటౌట్‌) పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది.

ఇక ఈ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ కేవలం​ 12 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. అయితే బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ను అర్ష్‌దీప్‌ ఔట్‌ చేసిన విధానం మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌ అని చెప్పవచ్చు. బంగ్లా ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ లో అర్ష్‌దీప్‌ తన తొలి బంతిని లిటన్‌ దాస్‌కు బ్యాకప్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. అయితే ఆఫ్‌సైడ్‌ పడిన బంతి ఒక్కసారిగా టర్న్‌ అయ్యి వికెట్లను గిరాటేసింది. దెబ్బకు వికెట్లు చెల్లా చెదురు అయ్యాయి. ఈ సూపర్బ్ డెలివరీకి లిటన్‌ దగ్గర అసలు సమాధానమే లేకుండా పోయింది. బిత్తర చూపులు చూస్తూ కొద్ది సేపు అక్కడే నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘అర్ష్ దీప్ ను మెయిన్ మ్యాచుల్లో కూడా ఆడించాలి’ అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by ICC (@icc)

టీమ్ ఇండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

బంగ్లాదేశ్ జట్టు:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కర్ధర్), జాకర్ అలీ (డబ్ల్యూకే), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తౌహీద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, తన్జిద్‌జ్‌జిద్‌స్లాం, తాంజిద్‌జ్ ఇస్లాం హసన్ సాకి, తన్వీర్ ఇస్లాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..