Team India: బ్యాచిలర్ లైఫ్‌కు బై బై.. స్నేహితురాలితో కలిసి పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్

బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ మరో టీమిండియా క్రికెటర్ పెళ్లిపీటలెక్కాడు. ఎలాంటి ముందస్తు సమాచారం, హంగామా, హడావిడి లేకుండా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి

Team India: బ్యాచిలర్ లైఫ్‌కు బై బై.. స్నేహితురాలితో కలిసి పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్
Team India Cricketer
Follow us
Basha Shek

|

Updated on: Jun 02, 2024 | 3:22 PM

బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ మరో టీమిండియా క్రికెటర్ పెళ్లిపీటలెక్కాడు. ఎలాంటి ముందస్తు సమాచారం, హంగామా, హడావిడి లేకుండా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. దీంతో స్టార్ క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ మూడు మూళ్ల బంధంలోకి అడుగు పెట్టిన క్రికెటర్ ఎవరో తెలుసా? ఇటీవలే ఐపీఎల్ లో కోల్ కతా నైటరైడర్స్ కు కప్ అందించిన ఆల్ రౌండర్ వెంకటేశ్అయ్యార్. తన గర్ల్‌ ఫ్రెండ్ శ్రుతి రంగనాథన్ ను అయ్యర్ వివాహమాడాడు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. ఇరు పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వెంకటేశ్- శ్రుతిల వివాహం గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు స్టార్ క్రికెటర్లు కొత్త జంటకు విషెస్ తెలుపుతున్నారు.

కాగా టీమిండియా తరఫున వెంకటేశ్ అయ్యర్ 9 టీ20లు, 2 వన్డే మ్యాచులు ఆడాడు. అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో మాత్రం అదరగొడుతున్నాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మొత్తం 15 మ్యాచుల్లో 158 స్ట్రైక్ రేట్​తో 370 పరుగులు చేశాడు. ముఖ్యంగా నాకౌట్మ మ్యాచుల్లో చెలరగి ఆడాడు. క్వాలిఫైయర్స్​-1లో SRH బౌలర్లను చితక బాదుతూ 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లోనూ అదే ఎస్ ఆర్ హెచ్ పై 26 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. తద్వారా కేకేఆర్ కు మూడో ఐపీఎల్ ట్రోఫీని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

మ్యారేజ్ ఫొటోస్ ఇవిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?