T20 World Cup: ఒకేరోజు రెండు సెమీ ఫైనల్స్.. రిజర్వ్ డే మాత్రం ఒకే మ్యాచ్‌కు.. రీజన్ తెలిస్తే రియాక్షన్ మాములుగా ఉండదంతే..
T20 World Cup 2024: నేటి నుంచి ఐసీసీ పొట్టి ఫార్మాట్ 9వ ప్రపంచ కప్ ప్రారంభమైంది. దీనిలో 20 జట్లు మొదటిసారి ఆడుతున్నాయి. టోర్నమెంట్‌లో మొదటిసారిగా, జూన్ 27న రెండు సెమీ-ఫైనల్‌లు ఒకే రోజు జరుగుతాయి. ఒకదానికి రిజర్వ్ డే, మరొక మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో నాన్ రిజర్వ్ డే సెమీఫైనల్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌పై ప్రభావం పడితే.. కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది.
T20 World Cup 2024: నేటి నుంచి ఐసీసీ పొట్టి ఫార్మాట్ 9వ ప్రపంచ కప్ ప్రారంభమైంది. దీనిలో 20 జట్లు మొదటిసారి ఆడుతున్నాయి. టోర్నమెంట్‌లో మొదటిసారిగా, జూన్ 27న రెండు సెమీ-ఫైనల్‌లు ఒకే రోజు జరుగుతాయి. ఒకదానికి రిజర్వ్ డే, మరొక మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో నాన్ రిజర్వ్ డే సెమీఫైనల్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌పై ప్రభావం పడితే.. కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది.
రెండు సెమీ-ఫైనల్‌లు ఒకే రోజు ఎందుకు?
భారత కాలమానం ప్రకారం జూన్ 27న రెండు సెమీఫైనల్‌లు ఒకే రోజు జరుగుతాయి. కానీ, అమెరికన్, కరేబియన్ టైమింగ్ ప్రకారం, మొదటి సెమీ-ఫైనల్ జూన్ 26 రాత్రి 8 గంటలకు, రెండవ సెమీ-ఫైనల్ జూన్ 27 ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది.
కాగా, రెండో సెమీ ఫైనల్ జూన్ 27న అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు గయానాలో ప్రారంభమవుతుంది. అదే రోజు వర్షం పడితే 250 నిమిషాల అదనపు సమయం అంటే 4 గంటల 10 నిమిషాలు ఉంచారు. దీనికి రిజర్వ్ డే ఉండదు. ఎందుకంటే రిజర్వ్ డే ఉంచినట్లయితే, మ్యాచ్ జూన్ 28 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో సెమీ-ఫైనల్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌కు చాలా తక్కువ సమయం లభిస్తుంది. ఆ మరుసటి రోజు జూన్ 29న ఫైనల్ జరగనుంది.
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌తో వివాదం..
ఈ క్రమంలో గతంలోనూ ఇలాంటి వివాదం చోటు చేసుకుంది. 10 సెప్టెంబర్ 2023, ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ బాగా ఆడారు. వీరిద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసిన వెంటనే 17వ ఓవర్లో రోహిత్ ఔట్ కాగా, 18వ ఓవర్లో గిల్ కూడా ఔటయ్యాడు. కోహ్లి, రాహుల్ ఇద్దరూ కొత్త బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చారు. ఇక్కడి నుంచి మ్యాచ్ పాకిస్థాన్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. 25వ ఓవర్లో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది.
అయితే, ఈ మ్యాచ్‌కు ప్రత్యేక రిజర్వ్ డే ఉంది. మరుసటి రోజు కోహ్లీ-రాహుల్ సెంచరీలు చేయడంతో భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ 128 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆ జట్టు 228 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వడంపై వివాదం నెలకొంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ బహిరంగంగా విమర్శించారు. శ్రీలంక, బంగ్లాదేశ్ అభిమానులు కూడా దీనికి వ్యతిరేకంగా కనిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..