AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనికి టాలెంట్ ఉంది టెక్నిక్ తెలియదు.. SRH ప్లేయర్ నితీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో తనదైన ముద్రను వేసుకున్నాడు. కెప్టెన్‎గా ప్రపంచంలోనే ది బెస్ట్‎గా నిలిచాడు. బ్యాటింగ్‎లోను తన సత్తాఏంటో చూపించాడు. వరల్డ్ బెస్ట్ ఫినిషర్‎గా పేరు తెచ్చుకున్న ధోని, బౌలర్ ఎవరైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. అలవోకగా బౌండర్లను బాధేస్తాడు. 42 ఏళ్ల వయసులోనూ ఐపిఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న ధోనిపై తాజాగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ధోనికి టాలెంట్ ఉంది టెక్నిక్ తెలియదు.. SRH ప్లేయర్ నితీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Srh Nitish
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 02, 2024 | 9:25 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో తనదైన ముద్రను వేసుకున్నాడు. కెప్టెన్‎గా ప్రపంచంలోనే ది బెస్ట్‎గా నిలిచాడు. బ్యాటింగ్‎లోను తన సత్తాఏంటో చూపించాడు. వరల్డ్ బెస్ట్ ఫినిషర్‎గా పేరు తెచ్చుకున్న ధోని, బౌలర్ ఎవరైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. అలవోకగా బౌండర్లను బాధేస్తాడు. 42 ఏళ్ల వయసులోనూ ఐపిఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న ధోనిపై తాజాగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

ఐపీఎల్ 2024లో యంగ్ ప్లేయర్ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతూ ఒక్కసారిగా దూసుకు వచ్చాడు. హైదరాబాద్ జట్టు తరఫున 2024 సీజన్లో 33 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్‎లో తన మార్క్ వేస్తున్న నితీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఏకంగా మాజీ కెప్టెన్ ధోని బ్యాటింగ్‎పై హాట్ కామెంట్ చేశాడు. విరాట్, ధోనికి టాలెంట్ ఉంది కానీ.. అతని బ్యాటింగ్లో టెక్నిక్ లేదన్నాడు. అలాగే విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే మహి బ్యాటింగ్లో ఆ టెక్నిక్ కనిపించదని నితీష్ అన్నాడు. హీరో కార్తికేయతో మాట్లాడుతూ నితీష్ ఈ వ్యాఖ్యలు చేసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీంతో నితీష్‎పై వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు ధోని ఫ్యాన్స్. దీనిపై నితీష్ తన ఇన్‎స్టాగ్రామ్ స్టోరీస్‎లో స్పందించాడు. నేను మాట్లాడింది ఒకటైతే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరొకటి అంటూ ధోనీకి తాను కూడా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..