AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: ఎట్టకేలకు మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. టీమిండియా కోచ్ పదవి చేపట్టడంపై ఏమన్నాడంటే?

రత జట్టు మాజీ ఆటగాడు, KKR జట్టు మెంటార్ అయిన గౌతమ్ గంభీర్ తదుపరి ప్రధాన కోచ్‌గా ఉంటాడని చాలా నివేదికలు చెబుతున్నాయి . అలాగే గంభీర్ షరతులన్నీ బీసీసీఐ అంగీకరించడంతో గంభీర్ తదుపరి ప్రధాన కోచ్‌గా మారేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. అయితే ఇప్పటి వరకు గంభీర్ దీనిపై ఏమీ మాట్లాడలేదు

Gautam Gambhir: ఎట్టకేలకు మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. టీమిండియా కోచ్ పదవి చేపట్టడంపై ఏమన్నాడంటే?
Gautam Gambhir
Basha Shek
|

Updated on: Jun 03, 2024 | 8:04 AM

Share

టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరు రానున్నారని చాలా మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా, భారత జట్టు మాజీ ఆటగాడు, KKR జట్టు మెంటార్ అయిన గౌతమ్ గంభీర్ తదుపరి ప్రధాన కోచ్‌గా ఉంటాడని చాలా నివేదికలు చెబుతున్నాయి . అలాగే గంభీర్ షరతులన్నీ బీసీసీఐ అంగీకరించడంతో గంభీర్ తదుపరి ప్రధాన కోచ్‌గా మారేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. అయితే ఇప్పటి వరకు గంభీర్ దీనిపై ఏమీ మాట్లాడలేదు. బీసీసీఐ నుండి అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు తొలిసారిగా గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ పదవి గురించి ఓ ప్రకటన చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా ఉంటాడని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిపై గంభీర్ ఒక ప్రకటన చేసి తన స్టాండ్‌ను స్పష్టం చేశాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి గంభీర్ హాజరయ్యారు. , మీరు టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్‌గా ఉండాలనుకుంటున్నారా మరియు ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలవడానికి మీరు ఏమి చేస్తారు? అన్న ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ.. ‘భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా అవకాశం రావడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండటం అంటే 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించడం అంటే పెద్ద విషయం’ అని చెప్పుకొచ్చాడు. అంటే గంభీర్ భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాడని స్పష్టమవుతోంది.

జూలై 1 నుంచి టీమిండియాకు కొత్త కోచ్

గంభీర్‌తో పాటు పలువురు వెటరన్ క్రికెటర్లు భారత జట్టు తదుపరి ప్రధాన కోచ్‌గా ఉండేందుకు చర్చలు జరిగాయి. కానీ ఒకరి తర్వాత మరొకరు చాలా మంది అనుభవజ్ఞులు ఈ బాధ్యత తీసుకోవడానికి నిరాకరించారు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర కూడా ప్రధాన కోచ్ పదవిని నిరాకరించారు. దీంతో బీసీసీఐ, భారత జట్టు మధ్య టెన్షన్ మొదలైంది. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. అటువంటి పరిస్థితిలో, గంభీర్ ప్రధాన కోచ్ అయినప్పటికీ జూలై 1 నుండి ఈ బాధ్యతను స్వీకరిస్తాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..