- Telugu News Photo Gallery Cricket photos Team India Cricketer Venkatesh Iyer Tied Knot With Shruti Raghunathan, Shares Photos
Venkatesh Iyer: ఐపీఎల్ కప్పు కొట్టాడు.. పెళ్లిపీటలెక్కాడు.. టీమిండియా క్రికెటర్ వెడ్డింగ్ ఫొటోస్ చూశారా?
టీమిండియా ఆల్ రౌండర్, కేకేఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ ఆదివారం ( జూన్02) పెళ్లి పీటలెక్కాడు. తన స్నేహితురాలు శ్రుతి రంగనాథన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Updated on: Jun 03, 2024 | 10:54 AM

టీమిండియా ఆల్ రౌండర్, కేకేఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ ఆదివారం ( జూన్02) పెళ్లి పీటలెక్కాడు. తన స్నేహితురాలు శ్రుతి రంగనాథన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

గతేడాది నవంబర్‌లో అయ్యర్- శ్రుతిల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం వైభవోపేతంగా పెళ్లి చేసుకున్నారు.

వెంకటేష్ భార్య శ్రుతి రఘునాథన్ బెంగళూరులోని లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మర్చండైజ్ ప్లానర్‌గా పనిచేస్తోంది.

శ్రుతి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) నుండి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పట్టా పొందింది. ఫ్యాషన్ టెక్నాలజీలో NIFT కు చాలా మంచి పేరుంది.

వెంటకేశ్, శృతిల వివాహ వేడుక దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లి వేడుకలో వీరిద్దరి వేషధారణ అభిమానులు, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది

వెంకటేష్, శ్రుతి ల పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్ల నుంచి కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.





























