- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: Netizens Troll Broadcaster As Hardik Pandya's Photo In The WI Vs PNG Scorecard
T20 World Cup 2024: ఇదేందయ్యా ఇది! సూస్కో బల్లే! విండీస్- పీఎన్‌జీ స్కోరు బోర్డులో హార్దిక్ ఫొటోలు
టీ20 ప్రపంచకప్ ప్రచారాన్ని టీమ్ ఇండియా బుధవారం (జూన్ 5) ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూయార్క్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో ఆడనుంది.
Updated on: Jun 03, 2024 | 1:27 PM

టీ20 ప్రపంచకప్ ప్రచారాన్ని టీమ్ ఇండియా బుధవారం (జూన్ 5) ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూయార్క్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో ఆడనుంది.

అయితే అంతకు ముందే T20 ప్రపంచ కప్ 2వ మ్యాచ్ స్కోర్ కార్డ్‌లో టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా ఫోటో కనిపించింది. వెస్టిండీస్, పపువా న్యూ గినియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చూపిన స్కోర్ కార్డ్‌లో అనుకోకుండా పాండ్యా చిత్రం దర్శనమిచ్చింది

.వెస్టిండీస్ బ్యాటర్ల జాబితాలో, పపువా న్యూగినియా బౌలర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఫొటో కనిపించడం విశేషం. ఇలా ఐదు పర్యాయాలు భారత జట్టు ఆటగాడి ఫొటోను ఉపయోగించి టోర్నీ ప్రసారకర్తలు పప్పులో కాలేశారు.

విండీస్ బ్యాటర్ రోస్టన్ చేజ్, బ్రెండన్ కింగ్, ఆండ్రీ రస్సెల్ ఫోటోలకు బదులుగా హార్దిక్ పాండ్యా చిత్రం బోర్డుపై కనిపించింది. అలాగే పపువా న్యూ గినియా బౌలర్లు సెసా బువా, అసద్ వాల్ చిత్రాలకు బదులు పాండ్యా ఫొటోను అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు ఈ స్కోర్ కార్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే 3 మ్యాచ్‌లు పూర్తి కాగా, జూన్ 5న ఐర్లాండ్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది.

జూన్ 9న భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది, ఈ మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దీని తర్వాత భారత జట్టు అమెరికా, కెనడా జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత సూపర్-8 దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.




