- Telugu News Photo Gallery Cricket photos Tilak Varma Will be retained in place of Rohit Sharma By mumbai Indians Ahead Of IPL 2025 Mega Auction
MI: హిట్‌మ్యాన్‌కు వెన్నుపోటు.. రోహిత్ స్థానంలో తెలుగు కుర్రాడు.. రిటైన్ లిస్టు ఇదే.!
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లు ఓడిపోయి.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. సీజన్‌కు ముందు ఆ ఫ్రాంచైజీకి కలిసొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టి..
Updated on: Jun 03, 2024 | 9:00 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లు ఓడిపోయి.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. సీజన్‌కు ముందు ఆ ఫ్రాంచైజీకి కలిసొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టి.. హార్దిక్ పాండ్యాకి సారధ్య బాధ్యతలను అప్పగించారు.

గుజరాత్ టైటాన్స్ నుంచి సుమారు రూ. 15 కోట్లకి హార్దిక్‌ను ట్రేడ్ చేసింది ముంబై. కొత్త కెప్టెన్.. సరికొత్తగా ఫ్రాంచైజీ.. ఐపీఎల్ 2024 సీజన్ బరిలోకి దిగితే.. అంచనాలు మించి.. అద్భుతంగా రాణిస్తుందని అందరూ భావించారు. అయితేనేం అవేం జరగలేదు.. హార్దిక్ సారధ్యంలో ముంబై నడిసంద్రంలో పడవలో మునిగిపోయింది.

ఆ జట్టు రెండు భాగాలుగా విడిపోయి.. రోహిత్ శర్మ వైపు కొందరు క్రికెటర్లు.. హార్దిక్ పాండ్యా వైపు విదేశీ ప్లేయర్లు, ఫ్రాంచైజీ ఓనర్లు ఉండటంతో.. జట్టు అపజయాలు చవిచూసింది.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్ ముగిసింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌పై అందరి కన్ను పడింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు మరో ప్లేయర్‌ను రైట్ టూ మ్యాచ్ కార్డుతో తీసుకునే వెసులుబాటును ఫ్రాంచైజీలకు కల్పించనుంది బీసీసీఐ.

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్టు ఒకసారి పరిశీలిస్తే.. ఆ సమయంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది.

ఇక వారిలో పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీకి వన్ ఆఫ్ ది కోచ్ కాగా.. అతడి స్థానంలో కచ్చితంగా ఈసారి హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోనుంది ముంబై యాజమాన్యం.

ఇక రోహిత్ శర్మకు ఫ్రాంచైజీకి మధ్య బంధం సరిగ్గా లేకపోవడంతో.. ఈసారి రోహిత్ శర్మ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. అటు రోహిత్ శర్మ స్థానంలో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను రిటైన్ చేసుకోనుంది ముంబై.





























