Kalki 2898 AD: రామ్ చరణ్ కూతురు క్లింకారకు ప్రభాస్ ‘కల్కి’ స్పెషల్ గిఫ్ట్.. ఉపాసన ఏమందో తెలుసా?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు.

Kalki 2898 AD: రామ్ చరణ్ కూతురు క్లింకారకు ప్రభాస్ 'కల్కి' స్పెషల్ గిఫ్ట్.. ఉపాసన ఏమందో తెలుసా?
Ram Charan, Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Jun 03, 2024 | 11:27 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ప్రభాస్ నడిపిన కారు బుజ్జీ ఆవిష్కరణ కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ బుజ్జీని తిప్పుతున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్కి టీమ్ సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ లు పంపుతోంది. తాజాగా రామ్‌ చరణ్‌- ఉపాసనల కుమార్తె క్లీంకార కొణిదెలకు కల్కి మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి – భైరవ స్టిక్కర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పిందీ మెగా కోడలు. ప్రస్తుతం బుజ్జి, భైరవ స్టిక్కర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా వీటిని మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపనున్నట్లు తెలుస్తోంది

ఇక కల్కి ప్రమోషన్లలో భాగంగా తాజాగా ‘బుజ్జి అండ్‌ భైరవ’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ తీసుకొచ్చింది చిత్రం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో బ్యూటీ ది షా పటానీ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. వీరితో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఓటీటీలో సందడి చేస్తోన్న బుజ్జి అండ్ భైరవ..

బుజ్జి కారును నడిపిన ఫార్ములా వన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!