కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్ మీద పెట్టిన దృష్టిని... ధనుష్ పబ్లిసిటీ మీద పెట్టడం లేదా? జూన్‌లో వచ్చే మిగిలిన సినిమాలు పబ్లిసిటీ విషయంలో జోరుమీదున్నాయి. మరి రాయన్ ధనుష్ ఎందుకు కాస్త వెనక్కి తగ్గే ఉంటున్నారు? దీనికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? మరీ హెక్టిక్‌గా ఉండటం వల్ల ఆయనకు కుదరడం లేదా? ధనుష్ సినిమా వస్తుందంటే కోలీవుడ్‌లో ఎంత ఆసక్తి ఉంటుందో, తెలుగు రాష్ట్రాల్లోనూ అదే ఇంట్రస్ట్ కనిపిస్తుంటుంది.