- Telugu News Photo Gallery Cinema photos Rayalaseema backdrop movies catch the accent very well our heroes
Film News: ట్రేండింగ్ లో రాయలసీమ.. యాసను బాగా పట్టేసిన హీరోలు..
ఈ మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. అలాగని ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయని కాదు. ఆ ప్రాంతంలోని భిన్నమైన కథలను ప్రేక్షకులకు చూపిస్తున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతపు యాసను బాగా పట్టేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో కూడా సీమ యాసను దించేసారు.
Updated on: Jun 03, 2024 | 10:55 AM

ఓ ప్రాంతం నేపథ్యంలో సినిమా చేస్తున్నపుడు ముఖ్యంగా అందరూ చూసేది యాస. అందుకే దసరాలో నాని అయినా.. పుష్పలో బన్నీ అయినా.. ఆ యాసపై అంత గ్రిప్ తెచ్చుకోడానికి ప్రయత్నించారు.

తాజాగా హరోం హరలో చిత్తూరు యాస మాట్లాడారు సుధీర్ బాబు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది.

రాయలసీమలోని చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో హరోం హర కథ సాగుతుంది. అందుకే సీమ యాసను ప్రాక్టీస్ చేసారు సుధీర్ బాబు. ఈయనొక్కరే కాదు.. సునీల్ సైతం చిత్తూరు యాసను దించేసారు.

పేరాలకు పేరాలు ఆరాలు తీయట్లేదు.. అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడట్లేదు... మేం ఒకటే ప్రశ్న అడుగుతున్నాం.. సమాధానం చెప్పండి చాలు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అంతగా వాళ్లు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా..?

అలాగే కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథలోనూ తిరుపతి యాస ఉంటుంది. ఈ సినిమా కథ అంతా అక్కడే జరుగుతుంది. మొత్తానికి ఒకప్పుడు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం సినిమాలకు పెట్టింది పేరైతే.. ఇప్పుడు యాసతో మనసులు గెలిచేస్తున్నారు మన హీరోలు.




