Pawan Kalyan: ‘ఈ విజయానికి మీరు అర్హులు.. మరింత పవర్ వచ్చేసింది అన్నయ్య’: హీరో నితిన్

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కాబోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన ఆయన ఈసారి బంపర్ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీతపై ఏకంగా 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడే జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి

Pawan Kalyan: 'ఈ విజయానికి మీరు అర్హులు.. మరింత పవర్ వచ్చేసింది అన్నయ్య': హీరో నితిన్
Pawan Kalyan, Nithiin
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2024 | 1:50 PM

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కాబోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన ఆయన ఈసారి బంపర్ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీతపై ఏకంగా 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడే జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. పవర్ స్టార్ ఎమ్మెల్యేగా త్వరలోనే అసెంబ్లీకి వెళుతున్నారంటూ స్వీట్టు పంచుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పవన్ కల్యాణ్ కు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ హరీశ్ శంకర్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ కు విషెస్ తెలిపారు. తాజాగా మరో హీరో నితిన్ కూడా ఈ జాబితాలో చేరాడు. సోషల్ మీడియా వేదికగా జనసేన అధిపతికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి నేను ఓ అభిమానిగా, సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నాను. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మా పవర్ స్టారే. మీకిప్పుడు మరింత పవర్ లభించనుంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు నితిన్.

ఇవి కూడా చదవండి

ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ లీడింగ్ లో కొనసాగుతోంది జనసేన. మొత్తం 21 స్థానాల్లో గాజు గ్లాసు ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన మద్దతుతో బరిలోకి దిగిన టీడీపీ, ఎన్టీయే కూటమి కూడా 150 కు పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక వైస్సార్ సీపీ ప్రస్తుతం కేవలం 16 స్థానల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

నితిన్ ట్వీట్ ఇదిగో..

అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్  ఆధిక్యంపై స్పందించారు. ‘పవర్ స్ట్రోమ్.. ప్రస్తుతం, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ చేతిలో  ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ గా ఉంటుందని ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది