
లోక్‌సభ ఎన్నికలు 2024
2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో 17వ లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్‌కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.
దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలోనే ప్రకటించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 30కి పైగా పార్టీలతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
వాయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్.. హాజరు కానున్న సోనియా, రాహుల్, సీఎం రేవంత్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు బుధవారం(అక్టోబర్ 23) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం […]
- Balaraju Goud
- Updated on: Oct 22, 2024
- 8:33 pm
Telangana Congress: ఆ సీట్లలో ఎందుకు ఓడిపోయాం.. కారణాలేంటి..? కురియన్ కమిటీ భేటీపై ఉత్కంఠ
లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది.. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు AICC నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 11, 2024
- 12:47 pm
President Speech: వికసిత్ భారత్‌కు ప్రజలు మద్దతు ఇచ్చారు.. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పాలనః రాష్ట్రపతి
లోక్‌సభ సమావేశాల్లో భాగంగా గురువారం సభ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను పార్లమెంటు ముందుంచారు.
- Balaraju Goud
- Updated on: Jun 27, 2024
- 12:04 pm
Om Birla: చరిత్ర సృష్టించిన ఓం బిర్లా. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా చేసింది వీరే..!
18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూజువాణి ఓటుతో విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
- Balaraju Goud
- Updated on: Jun 26, 2024
- 1:02 pm
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా.. మూజువాణి ఓటింగ్‌తో ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటన
లోక్‌సభ నూతన స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై విజయం సాధించారు. మూజువాణి ఓటింగ్‌తో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.
- Balaraju Goud
- Updated on: Jun 26, 2024
- 11:46 am
Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయ ప్రయత్నాలు.. లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ..!
ఎన్డీయే సర్కార్, ప్రతిపక్ష కూటమి భారత్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బుధవారం (జూన్ 26) సభలో ఎన్నిక జరగనుంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. విపక్షం తన బలాన్ని చాటుకోవడానికి ఈ ఎన్నిక అవకాశంగా మారబోతోంది. తటస్థులు ఎటువైపు ఉన్నారో కూడా తేలబోతోంది.
- Balaraju Goud
- Updated on: Jun 26, 2024
- 10:47 am
Lok Sabha Speaker Election: దేశ చరిత్రలోనే తొలిసారి.. స్పీకర్ పదవికి ఎన్నిక.. బరిలో బిర్లా, సురేష్..!
లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. ప్రతిపక్షాల స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్ బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే తరపున లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2024
- 1:00 pm
Speaker: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా.. మరికాసేపట్లో ఎన్డీయే నేతలతో కలిసి నామినేషన్!
లోక్‌సభ మాజీ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈమేరకు ఉదయం 11:30 లోక్‌సభ సెక్రటేరియట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- Balaraju Goud
- Updated on: Jun 25, 2024
- 1:02 pm
Parliament: 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు షురూ.. రెండు రోజుల పాటు కొత్త ఎంపీల ప్రమాణం.. 26న స్పీకర్ ఎన్నిక
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు, రేపు లోక్‌సభ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారగా.. ప్యానెల్‌లోని ముగ్గురు విపక్ష సభ్యులు సహకరించకుంటే అధికార పక్షం వ్యూహంపై ఆసక్తి నెలకొంది.
- Balaraju Goud
- Updated on: Jun 24, 2024
- 7:51 am
Parliament: రేపటి నుంచి పార్లమెంట్.. తొలిరోజే ప్రధాని సహా 280 మంది ఎంపీల ప్రమాణస్వీకారం
18వ లోక్‌సభ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 24 ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కొత్త ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు.
- Balaraju Goud
- Updated on: Jun 23, 2024
- 1:05 pm