Lok Sabha Speaker Election: దేశ చరిత్రలోనే తొలిసారి.. ‌స్పీకర్ పదవికి ఎన్నిక.. బరిలో బిర్లా, సురేష్..!

లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. ప్రతిపక్షాల స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్ బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే తరపున లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు.

Lok Sabha Speaker Election: దేశ చరిత్రలోనే తొలిసారి.. ‌స్పీకర్ పదవికి ఎన్నిక.. బరిలో బిర్లా, సురేష్..!
K Suresh Om Birla
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 25, 2024 | 1:00 PM

లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. ప్రతిపక్షాల స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్ బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే తరపున లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్ 26న బుధవారం జరగనుంది. స్పీకర్ పదవికి ఎన్నికలు జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అధికార, విపక్షాల ఏకాభిప్రాయంతోనే స్పీకర్‌ను ఎన్నుకునేవారు. అయితే ఈసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

అంతకుముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడి స్పీకర్ పదవికి మద్దతు కోరారు. స్పీకర్ పదవికి విపక్షాలు మద్దతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, అయితే ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే దీనిపై రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి తరుఫున సురేష్‌ను బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఇంతకీ కె సురేష్ ఎవరు..?

కె సురేష్ 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1989, 1991, 1996, 1999, 2009, 2014, 2019, 2024లో ఎంపీగా ఎన్నికయ్యారు. కే సురేష్ కేరళలోని మావెలిక్కర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అత్యంత అనుభవం ఉన్న ఎంపీ అయినప్పటికీ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నిక కాకపోవడంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. 1989లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కె సురేష్ అక్టోబర్ 2012 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..