AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ ఇదిగో

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 216 అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్), రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్ తదితర..

Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ ఇదిగో
DSSSB Assistant Manager Jobs
Srilakshmi C
|

Updated on: Mar 05, 2026 | 1:03 PM

Share

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 216 అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్), రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 18, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఏయే పోస్టులకు ఏయే అర్హతలు ఉండాలంటే..

  • అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు టూరిజంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ/సీఎంఏతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎల్‌ఎల్‌బీతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • రేడియో గ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్‌తోపాటు రేడియోగ్రఫీలో డిప్లొమా/సర్టిఫికేట్/బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • పట్వారీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో 28 మార్చి 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికోద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. టైర్ 1, టైర్ 2 రాత పరీక్షల ద్వారా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు పోస్టును బట్టి రూ.18,000 నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ లింక్ ఇదే
డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ లింక్ ఇదే
ఇంట్లో బల్లుల సమస్యకు చెక్… ఈ నేచురల్ టిప్స్ తప్పక ట్రై చేయండి
ఇంట్లో బల్లుల సమస్యకు చెక్… ఈ నేచురల్ టిప్స్ తప్పక ట్రై చేయండి
ఎన్టీఆర్, రవితేజ వల్లే కాలేదు.. మహేష్ ఒక్కడు మూవీని..
ఎన్టీఆర్, రవితేజ వల్లే కాలేదు.. మహేష్ ఒక్కడు మూవీని..
ఏటీఎం పిన్ నంబర్ గా వీటిని వాడుతున్నారా?.. ఈ డేంజర్ తెలుసుకోండి
ఏటీఎం పిన్ నంబర్ గా వీటిని వాడుతున్నారా?.. ఈ డేంజర్ తెలుసుకోండి
మరోసారి పేలనున్న వెండి బుడుగ.. ధరలు ఒకేసారి..
మరోసారి పేలనున్న వెండి బుడుగ.. ధరలు ఒకేసారి..
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాడి నీచ బుద్ధి
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాడి నీచ బుద్ధి
తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌