Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా.. మూజువాణి ఓటింగ్‌తో ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటన

లోక్‌సభ నూతన స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై విజయం సాధించారు. మూజువాణి ఓటింగ్‌తో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు.

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా.. మూజువాణి ఓటింగ్‌తో ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటన
Om Birla As Lok Sabha Speaker
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2024 | 11:46 AM

లోక్‌సభ నూత స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి కె.సురేష్‌పై విజయం సాధించారు. మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ సమావేశాలు మూడో రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదట కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక చేపట్టారు. మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.

అంతకు ముందు స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సహా పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేష్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.

18 వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లాను ఎన్‌డిఎ తన అభ్యర్థిగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా, 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. రాజస్థాన్‌లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఓం బిర్లా గెలించి చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా ఎన్నికై ఘనత సాధించారు.