AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపు మండిన పేదలు.. మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు..ఎక్కడంటే..

స్లిప్ డ్రా చేసిన తర్వాత వారికి రేషన్ ఇవ్వడం లేదు. సోమవారం కూడా అలాంటిదే జరిగింది. మహిళా రేషన్ డీలర్ బొటన వేలితో స్లిప్పులు తీస్తుండగా, రేషన్ డిమాండ్ చేయడంతో లబ్ధిదారులతో గొడవకు దిగింది డీలర్. దీంతో ఆగ్రహించిన రేషన్‌కార్డు లబ్ధిదారులు డీలర్‌ మెడలో చెప్పుల దండవేసి సుమారు 5 కిలోమీటర్ల మేర ఊరేటించారు. రహదారిని దిగ్బంధించారు.

కడుపు మండిన పేదలు.. మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు..ఎక్కడంటే..
Ration Dealer
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2024 | 10:04 AM

Share

మహిళా రేషన్ డీలర్ మెడలో చెప్పుల దండతో గ్రామం చుట్టూ ఊరేగించిన ఉదంతం జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా నుండి వెలుగులోకి వచ్చింది. గత నాలుగు నెలలుగా మహిళా రేషన్ డీలర్ సరుకులు పంపిణీ చేయడం లేదని సబ్సిడీ రేషన్ కార్డు లబ్ధిదారులు ఆరోపించారు. అందుకు ఆగ్రహించిన లబ్ధిదారులు సదరు రేషన్‌ డీలర్‌కు ఇలా షాకిచ్చారు. ఈ సంఘటన గోపోకందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోద్రిక్తులైన లబ్ధిదారులు మహిళా రేషన్ డీలర్ మెడలో చెప్పుల దండవేసి ఊరంతా తిప్పారు. ఈ విషయం పోలీసులకు చేరింది.

రేషన్ డీలర్‌పై లబ్దిదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమ బొటన వేలి ముద్ర వేసి స్లిప్ తొలగిస్తున్నారని రేషన్ కార్డు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వాటిలో కొన్ని 5 స్లిప్‌లు, మరికొన్నింటికి 4 స్లిప్‌లు ఉన్నాయి. స్లిప్ డ్రా చేసిన తర్వాత వారికి రేషన్ ఇవ్వడం లేదు. సోమవారం కూడా అలాంటిదే జరిగింది. మహిళా రేషన్ డీలర్ బొటన వేలితో స్లిప్పులు తీస్తుండగా, రేషన్ డిమాండ్ చేయడంతో లబ్ధిదారులతో గొడవకు దిగింది డీలర్. దీంతో ఆగ్రహించిన రేషన్‌కార్డు లబ్ధిదారులు డీలర్‌ మెడలో చెప్పుల దండవేసి సుమారు 5 కిలోమీటర్ల మేర ఊరేటించారు. దుమ్కా-పాకుడ్ రహదారిని దిగ్బంధించారు.

రేషన్‌ అందకపోవడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు గోవింద్‌పూర్‌-సాహెబ్‌గంజ్‌ రాష్ట్ర రహదారిని అరగంటకు పైగా దిగ్బంధించి నిరసన తెలిపారని గోపోకందర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి రంజిత్‌ మండల్‌ తెలిపారు. లబ్ధిదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టగా పోలీసులు వారిని శాంతింపజేశారు. మంగళవారం రేషన్‌ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై జిల్లా సరఫరా అధికారి విశాల్ కుమార్ స్పందించారు. లబ్ధిదారులకు సకాలంలో రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని బీడీఓను ఆదేశించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..