AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఆ సీట్లలో ఎందుకు ఓడిపోయాం.. కారణాలేంటి..? కురియన్ కమిటీ భేటీపై ఉత్కంఠ

లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది.. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు AICC నియమించిన జేపీ కురియన్‌ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌ చేరుకుంది.

Telangana Congress: ఆ సీట్లలో ఎందుకు ఓడిపోయాం.. కారణాలేంటి..? కురియన్ కమిటీ భేటీపై ఉత్కంఠ
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Jul 11, 2024 | 12:47 PM

Share

లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది.. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు AICC నియమించిన జేపీ కురియన్‌ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌ చేరుకుంది. కమిటీ సభ్యులకు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ స్వాగతం పలికారు. కురియన్‌తో పాటు రకీబుల్‌ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు గాంధీభవన్‌లో పార్టీ సీనియర్‌ నేతలతో వరుసగా భేటీ అవుతారు. నేడు ఎంపీలు, లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతారు.

ఈ సందర్భంగా పలు కీలక విషయాలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ గెలుస్తుందనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీస్తారు. రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. మూడో రోజు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు కమిటీ సభ్యులు వెళతారా..? లేదా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్‌ వంటి స్థానాల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులేమిటనే కోణంలో అధిష్ఠానం ఆరా తీస్తోంది.

ఈ లోక్‌సభ స్థానాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గినా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కమిటీ విశ్లేషణ జరుపుతుందని సమాచారం. ఆయా స్థానాల నేతలు తగు సమాచారంతో హాజరుకావాలని ఇప్పటికే వారికి పార్టీ సూచించింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక నేతలు సరిగా పనిచేయలేదనే ఆరోపణలు సైతం ఉండటంతో వారి గురించి వివరాలు సేకరించనుంది. నేతల పనితీరు, పోల్‌ మేనేజ్‌మెంట్‌కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ సమాచారం అడగనుందని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..