అందరూ నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి దారుణం.. ఇంట్లోకి కత్తితో ప్రవేశించిన ప్రేమోన్మాది.. ఆ తర్వాత..
వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ ప్రేమోన్మాది.. ప్రియురాలి కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.. నిద్రిస్తున్న దంపతులను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. తాను ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు తనకు దూరం పెట్టారన్న కక్షతో కిరాతకుడు తల్వార్ తో అత్యంత ఘోరంగా నరికి చంపాడు. ఈ క్రమంలో ప్రియురాలు, ఆమె సోదరుడిపై కూడా తల్వార్ తో దాడి చేశాడు.
వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ ప్రేమోన్మాది.. ప్రియురాలి కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.. నిద్రిస్తున్న దంపతులను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. తాను ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు తనకు దూరం పెట్టారన్న కక్షతో కిరాతకుడు తల్వార్ తో అత్యంత ఘోరంగా నరికి చంపాడు. ఈ క్రమంలో ప్రియురాలు, ఆమె సోదరుడిపై కూడా తల్వార్ తో దాడి చేశాడు.. ప్రస్తుతం వారిద్దరూ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాలో జరిగింది. మృతులను బానోతు శ్రీను, సుగుణగా గుర్తించారు. యువతి కుటుంబం ఆరుబయట నిద్రిస్తుండగా అర్థరాత్రి తల్వార్‌తో దాడి చేశాడు.. ఈ ఘటనలో యువతి తల్లి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్నిబాయికి చెందిన నాగరాజు అలియాస్ బన్నీ చింతలతండా దీపిక కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు..వీరు మూడు నెలలు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు.
ఆ తర్వాత.. తాను ప్రేమించిన యువతి తన నుంచి విడిపోవడానికి యువతి తల్లిదండ్రులే కారణమని.. మా ఇద్దరినీ విడదీశారని కోపంతో ప్రియుడు నాగరాజు(బన్నీ ) ఆ కుటుంబంపై కక్షపెంచుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి శ్రీను కుటుంబం ఇంటి బయట నిద్రపోతుండగా.. బన్నీ కత్తితో అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో ఇంట్లోకి ప్రవేశించాడు.. అనంతరం నిద్రలో ఉన్న యువతి తల్లి బానోతు సుగుణ (40), శ్రీనివాస్ (45) పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో యువతి తల్లి బానోతు సుగుణ 40 అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి బానోతు శ్రీనివాస్ (45) నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీపిక( 21), ఆమె సోదరుడు మదన్ (18) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమోన్మాది కుటుంబాన్ని బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు బన్నీ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..