Warangal: ఘోర విషాదం! భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అనాథలైన ముగ్గురు చిన్నారులు
వరంగల్ చెన్నారెడ్డి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. వరంగల్ నగరంలోని 18వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీకి చెందిన మంద చరణ్ అలియాస్ చేరాలు(45), స్వప్న (42) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు గ్రేసీ (16), మెర్సీ (14), కుమారుడు షాలోమ్ (12). కుమారుడు పుట్టుకతోనే అంధుడు..
వరంగల్, జులై 10: వరంగల్ చెన్నారెడ్డి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. వరంగల్ నగరంలోని 18వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీకి చెందిన మంద చరణ్ అలియాస్ చేరాలు(45), స్వప్న (42) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు గ్రేసీ (16), మెర్సీ (14), కుమారుడు షాలోమ్ (12). కుమారుడు పుట్టుకతోనే అంధుడు. చేరాలు మేస్త్రీ పనిచేస్తుండగా, స్వప్న బట్టల దుకాణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నారు. దంపతుల మధ్య గొడవల కారణంగా మూడు మాసాలుగా చరణ్ ఇంటికి రావడం లేదు. సోమవారం ఇంటికి వచ్చిన చేరాలు ముందస్తు పథకం ప్రకారం అదే రోజు సాయంత్రం పిల్లలను వరంగల్ ఉర్సు ప్రాంతంలోని స్వప్న పుట్టింటి వద్ద వదిలిపెట్టాడు. అదే రోజు రాత్రి భార్యతో గొడవపడిన చేరాలు అర్ధరాత్రి సమయంలో రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం గదిలో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించాడు. కానీ పోలీసులకు పట్టుబడతానన్న భయంతోమరుసటి రోజు మంగళవారం ఉదయం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంగళవారం ఉర్సు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన పిల్లలు.. ఇంట్లో విగత జీవులుగా పడిఉన్న తల్లిదండ్రులను చూసి భోరుమని విలపించారు. వారి ఏడుపు తిని పరుగు పరుగున వచ్చిన స్థానికులు చేరాలు, స్వప్న మృతి చెంది ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరంలించారు. భార్యాభర్తల మృతితో అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల దయనీయ పరిస్థితిని చూసి చలించిన సీఐ మల్లయ్య ముగ్గురు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు. స్వప్న సోదరుడు సారయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల గొడవలు వారి పిల్లలకు శాపంగా మారింది. దీంతో ముగ్గురు పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. సరైన భోజనం కూడాలేకపోవడంతో దీనస్థితికి చేరుకున్నారు. దీనికి తోడు మెర్సీకి గుండె సంబంధిత సమస్య ఉంది. కుమారుడు షాలోమ్‌కు కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు సఖ్యతగా లేకపోవడం వల్ల ఓవైపు అనారోగ్యం, మరోవైపు పేదరికం.. వల్ల దిక్కులేని వారిగా మిగిలిపోయారు. తండ్రి తమకు ఏనాడు కడుపునిండా భోజనం పెట్టకపోయినా.. గతంలో మూడుసార్లు ఆత్మహత్యకు యత్నిస్తే.. పిల్లలంతా తండ్రిని కాపాడుకున్నారు. కానీ ఈసారి ఓడిపోయమని చెబుతూ రోధించారు. దాతలు ఎవరైనా ఆదుకుంటే బాగా చదువుకుని తమ కష్టాలు గట్టెక్కేలా ప్రయోజకులం అవుతామని ఆ పసివాళ్లు చెబుతుంటే గుండెలు నీరుగారిపోతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.