Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డిన్నర్‌ ప్లేట్‌లో ‘పాస్తా’ కపుల్‌ రోమాంటిక్‌ డ్యాన్స్‌..! సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వింత వీడియో వైరల్‌ అవుతూ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియోల్లో రోటీన్‌కు భిన్నంగా.. ఆశ్చర్యం అంచులదాకా తీసుకెళ్లి మన కళ్లను మనమే నమ్మలేనంత ట్యాలెంటెడ్‌ దృశ్యాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇలాంటి వీడియోలలో ఈ వీడియో స్పెషాలిటీనే వేరు. ఎందుకంటే తినే ప్లేట్‌లోని నూడిల్స్‌, పాస్తాలతో డ్యాన్స్‌ చేయించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదు. కానీ అతను తల్చుకుంటే పువ్వులు, ఆకులు, కంచంలో ఆహారాలు ఇలా అవీఇవీ అని కాకుండా దేనితో అయినా కుప్పిగంతులు వేయించేస్తాడు..

Viral Video: డిన్నర్‌ ప్లేట్‌లో 'పాస్తా' కపుల్‌ రోమాంటిక్‌ డ్యాన్స్‌..! సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో
Pasta Dance
Srilakshmi C
|

Updated on: Jul 09, 2024 | 11:21 AM

Share

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక వింత వీడియో వైరల్‌ అవుతూ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియోల్లో రోటీన్‌కు భిన్నంగా.. ఆశ్చర్యం అంచులదాకా తీసుకెళ్లి మన కళ్లను మనమే నమ్మలేనంత ట్యాలెంటెడ్‌ దృశ్యాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇలాంటి వీడియోలలో ఈ వీడియో స్పెషాలిటీనే వేరు. ఎందుకంటే తినే ప్లేట్‌లోని నూడిల్స్‌, పాస్తాలతో డ్యాన్స్‌ చేయించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఏఐ పుణ్యమా అని అది కూడా జరిగిపోయింది. ఏకంగా కంచంలోని తినే పదార్ధాలు చక్కగా.. ఎవరో ట్రైనింగ్‌ ఇచ్చినట్లు మనుషులు ఎలా చేస్తారో.. అచ్చం అలాగే డ్యాన్స్‌ ఇరగతీశాయ్‌. ఓ అబ్బాయి.. ఓ అమ్మాయిలా రెండు పాస్తా పీస్‌లు చాలా స్మూత్‌గా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఇది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ ముచ్చటపడిపోతున్నారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు 48 మిలియన్లకు పైగా వ్యాస్ వచ్చాయంటే.. అది మామూలు పర్ఫామెన్స్‌ కాదు మరి. మంత్రముగ్దులను చేస్తున్న పాస్తా పనితనం మీరూ చూసేయండి..

ఇదంతా AI యానిమేషన్‌లలో నైపుణ్యం కలిగిన సృష్టికర్త జేమ్స్ గెర్డే ప్రాణం పోసిన అద్భుతం. మానవ నృత్యకారుల కదలికలను అనుకరిస్తూ పాస్తా పీసెస్‌తో ఈ వీడియోను రూపొందించారు. ఈ పాస్తా డ్యాన్స్‌ వైరల్ వీడియోకు.. ‘ఫుడ్‌ ఈజ్‌ మై లవ్‌ ల్యాంగ్వేజ్‌’ అనే క్యాప్షన్‌తో దీనిని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇక ఈ డ్యాన్స్ స్పఘెట్టి వీడియో నెటిజన్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. వారికి ఈ వీడియో తెగ నచ్చేసిందట.. ఈ విషయాన్ని కామెంట్ సెక్షన్‌లో పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by James Gerde (@gerdegotit)

‘ఈ వీడియో గురించి ఆలోచించకుండా నేను ఎప్పటికీ పాస్తా తినలేను!’, ‘ఇటువంటి మృదువైన రెండర్, యానిమేషన్‌ను సృష్టించిన మీ ట్యాలెంట్‌ అదరహో..’, ‘ఈ వీడియో చూశాక పాస్తాపై ప్రేమ మరింత పెరిగింది’, ‘నేను దీన్ని చాలాసార్లు చూశానో నాకే తెలియదు. ప్రతిసారీ ఇది నన్ను నవ్విస్తూనే ఉంది. చాలా అందంగా, సృజనాత్మకంగా ఉంది’, ‘ అయ్యో.. ఇప్పుడే పాస్తా తిన్నా.. పొట్ట లోపల ఏం చేస్తున్నాయో ఏమో’ అంటూ నెటిజన్లు సరదాగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకీ మీరేమంటారు..?

మరిన్ని ట్రెండింగ్‌ ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.