Mutton: మటన్‌ తెచ్చిన తంటా.. కూరొండలేదనీ చెరువులో దూకిన భర్త! పోలీసుల ఎంట్రీతో అడ్డంతిరిగిన కథ..

ఓ భర్త ముచ్చటపడి ఆదివారం నాడు కిలో మటన్‌ తీసుకొచ్చాడు. భార్యతో రుచిగా వండించుకుని హాయిగా తినేద్దామని భావించాడు. అయితే తమ ఆర్ధిక స్తోమత అతంగా మాత్రంగానే ఉంటే అధిక ధర తగలేసి మటన్‌ కొని తీసుకొస్తావా? అంటూ ఆ ఇంటి ఇల్లాలు భర్తపై కస్సుబుస్సులాడింది. దీంతో భార్యభర్తలు గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం చెందిన పతి దేవుడు ఇక బతికుండటం దండగని చెరువులో దూకి ఆత్మహత్యకు...

Mutton: మటన్‌ తెచ్చిన తంటా.. కూరొండలేదనీ చెరువులో దూకిన భర్త! పోలీసుల ఎంట్రీతో అడ్డంతిరిగిన కథ..
Motton
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 08, 2024 | 8:22 AM

దుండిగల్‌, జూలై 8: తెలుగు వారు భోజన ప్రియులు. నచ్చిన వంటకాన్ని క్షణాల్లో తయారు చేసుకుని, కడుపారా ఆరగించడం ఎందరికో అలవాటు. ఇక ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్‌ వెజ్‌ వంటకాల ఘుమఘుమలు ముక్కు పుటాలను ఎగరేస్తాయి. కొందరు చికెన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తే.. మరికొందరేమో కాస్త ధర ఎక్కువైనా పర్లేదు మటన్‌ మాత్రమే కావాలంటూ పట్టుబడతారు. అయితే తాజాగా ఓ భర్త ముచ్చటపడి ఆదివారం నాడు కిలో మటన్‌ తీసుకొచ్చాడు. భార్యతో రుచిగా వండించుకుని హాయిగా తినేద్దామని భావించాడు. అయితే తమ ఆర్ధిక స్తోమత అతంగా మాత్రంగానే ఉంటే అధిక ధర తగలేసి మటన్‌ కొని తీసుకొస్తావా? అంటూ ఆ ఇంటి ఇల్లాలు భర్తపై కస్సుబుస్సులాడింది. దీంతో భార్యభర్తలు గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం చెందిన పతి దేవుడు ఇక బతికుండటం దండగని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విచిత్ర ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం (జులై 7) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..

బాచుపల్లిలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సాయిని నరేశ్‌, రాణి దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నరేశ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాణి కూలి పనుల కెళ్తూ కాపురం జరుపుతున్నారు. దీంతో నిన్న ఆదివారం కావడంతో నరేశ్‌ మటన్‌ కొని తీసుకొచ్చాడు. అయితే తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటే.. ఏ మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా నరేశ్‌ అధిక ధర దారపోసి మటన్‌ తీసుకు రావడం రాణికి సుతారం నచ్చలేదు. దీంతో మటన్‌ ఎందుకు తెచ్చావని రాణి భర్తతో గొడవపడింది. ఈ విషయంపై రాణి, నరేశ్‌ కొద్ది సమయం వాదులాడుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నరేశ్‌ అక్కడి నుంచి నేరుగా సమీపంలోని బైరుని చెరువు వద్దకు వెళ్లాడు.

అనంతరం నడుముకు పెద్దరాయి కట్టుకుని చెరువులోకి దూకబోయాడు. ఇంతలో స్థానికులు అక్కడికి వచ్చి అతడిని అడ్డుకోవడంతో గండం తప్పింది. అనంతరం దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్‌ సత్యపాల్‌రెడ్డి చెరువులోకి దిగి నరేశ్‌ను ఒడ్డుకు తీసుకొచ్చి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం రాణిని కూడా స్టేషన్కు పిలిపించి దంపతులిద్దరికి సర్దిచెప్పేయత్నం చేశారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు