Gold Chain for Dog: శునకభోగమంటే ఇదికదా! పెంపుడు కుక్క బర్త్‌డేకు రూ.2.5 లక్షల బంగారు గొలుసు గిఫ్ట్..

కొందరు పెంపుడు జంతువులపై తమ సొంత పిల్లల కంటే అమితంగా ప్రేమానురాగాలు ఒలకబోస్తూ ఉంటారు. వాటికి పుట్టిన రోజులు, బార సాలలు.. కొందరు ఏకంగా పెళ్లిళ్లు కూడా జరిపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా అచ్చటా ముచ్చటా జరిపిస్తుంటారు. తమ ఇంటి పసిపిల్లలకు మాదిరి స్నానం చేయించడం, అనారోగ్యం పాలైతే హైరానా పడిపోతూ ఆసుపత్రులకు పరుగులు తీయడం వంటివి చేస్తుంటారు..

Gold Chain for Dog: శునకభోగమంటే ఇదికదా! పెంపుడు కుక్క బర్త్‌డేకు రూ.2.5 లక్షల బంగారు గొలుసు గిఫ్ట్..
Gold Chain For Dog
Follow us

|

Updated on: Jul 07, 2024 | 7:36 PM

ముంబై, జులై 7: కొందరు పెంపుడు జంతువులపై తమ సొంత పిల్లల కంటే అమితంగా ప్రేమానురాగాలు ఒలకబోస్తూ ఉంటారు. వాటికి పుట్టిన రోజులు, బార సాలలు.. కొందరు ఏకంగా పెళ్లిళ్లు కూడా జరిపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా అచ్చటా ముచ్చటా జరిపిస్తుంటారు. తమ ఇంటి పసిపిల్లలకు మాదిరి స్నానం చేయించడం, అనారోగ్యం పాలైతే హైరానా పడిపోతూ ఆసుపత్రులకు పరుగులు తీయడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఓ మహిళ వీరందరినీ దాటి మరోమెట్టు ఎక్కైసింది. పసిపాపకు చేయించినట్టు పుట్టిన రోజుకు ఏకంగా జువెల్లరీ షాప్‌కు తీసుకెళ్లి.. గంటల తరబడి షాపింగ్‌ చేసి.. ఓ గోల్డ్‌ చైన్ సెలక్ట్ చేసి, శునకం గారి మెడలో వేసి తెగ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ఈ శునక భోగాన్ని మీరూ చూసేయండి..

ముంబైలోని చెంబూర్‌ ఏరియాలో సరితా సల్దాన్హా అనే మహిళ నివసిస్తున్నది. ఆమె ఓ కుక్కను ముద్దుముద్దుగా పెంచుకుంటుంది. దానికి ‘టైగర్‌’ అనే పేరు పెట్టుకుని దాని అచ్చటా ముచ్చటా చూస్తుంది. అయితే పోయిన నెలలో టైగర్‌ పుట్టినరోజు వచ్చింది. ఈ అకేషన్‌ను సరిత ఘనంగా నిర్వహించాలనుకుంది. ఇంకేం.. టైగర్‌ను చంకనేసుకుని నగరంలో అనిల్ జ్యువెల్లరీకి వెళ్లింది. పుట్టిన రోజు సందర్భంగా టైగర్‌ ఖరీదైన గిఫ్ట్‌ బహూకరించాలని భావించిన సరితా.. ఏకంగా 35 గ్రామలు గోల్డ్‌ చైన్‌ ను రూ.2.5 లక్షలతో కొనుగోలు చేసి టైగర్‌ మెడలో వేసింది. అనంతరం దానితో అడుకుంటూ తెగ ఉప్పొంగిపోయింది. ఇందకు సంబంధించిన వాడియోను అనిల్ జ్యువెలర్స్ ఓనర్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

‘ మానుషులు, జంతువుల మధ్య ఉన్న అనుబంధాన్ని పండగలా జరుపుకుంటున్నారు’ అనే క్యాప్షన్‌తో అనిల్ జ్యువెలర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతోపాటు రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వీక్షణలు, లైకులు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!