AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka Arrest: టీజీపీఎస్సీ వద్ద బర్రెలక్క ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు! వీడియో

టీజీపీఎస్‌సీ కార్యాలయం దగ్గర నిరుద్యోగుల నిరసన మిన్నంటింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతుగా అక్కడికి వచ్చిన బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం తగదని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్‌సీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష..

Barrelakka Arrest: టీజీపీఎస్సీ వద్ద బర్రెలక్క ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు! వీడియో
Barrelakka Arrest
Srilakshmi C
|

Updated on: Jul 05, 2024 | 5:41 PM

Share

హైదరాబాద్‌, జులై 5: టీజీపీఎస్‌సీ కార్యాలయం దగ్గర నిరుద్యోగుల నిరసన మిన్నంటింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతుగా అక్కడికి వచ్చిన బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం తగదని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్‌సీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీషను పోలీసులు, అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్‌ చేసి, వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఆమె ‘సీఎం రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దంటూ’ నినదించారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడం ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంపుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, జీవో 46 రద్దు వంటి పలు డిమాండ్లతో నిరుద్యోగులు శుక్రవారం పోరుబాట పట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో పలు ప్రాంతాల్లో పహారాలో ఉన్నాయి. హైదరాబాదులోని అన్ని రీడింగ్ రూమ్స్, గ్రంథాలయాలు, మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గుమిగూడిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నిరుద్యోగల మార్చ్‌ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. జిల్లాల నుంచి యువత రాజధానికి రాకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నది. ఇప్పటికే వందల మందిని అక్రమంగా అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టూ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి, జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతు తెలుపుతూ అక్కడికి వచ్చిన బర్రెలక్క ఆందోళనకు దిగగా.. ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో