AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thief Apology Letter: ‘క్షమించండి! తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా.. నెలలో తిరిగిచ్చేస్తా’ దొంగ గారి లేఖ

ఎవరూలేని సమయం చూసి ఈ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. దొరికిన కాడికి దోచేసి.. వెళ్తూ వెళ్తూ ఓ లెటర్‌ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. తాను దొంగ కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వారి ఇంట్లో దొంగతనం చేస్తున్నానని, దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ సదరు లేఖలో దొంగ రాసి పెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన యజమానులు ఇంటిలో సొమ్ము పోయిందని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు..

Thief Apology Letter: 'క్షమించండి! తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా.. నెలలో తిరిగిచ్చేస్తా' దొంగ గారి లేఖ
Thief Apology Letter
Srilakshmi C
|

Updated on: Jul 04, 2024 | 5:08 PM

Share

చెన్నై, జులై 4: ఎవరూలేని సమయం చూసి ఈ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. దొరికిన కాడికి దోచేసి.. వెళ్తూ వెళ్తూ ఓ లెటర్‌ అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. తాను దొంగ కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వారి ఇంట్లో దొంగతనం చేస్తున్నానని, దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ సదరు లేఖలో దొంగ రాసి పెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన యజమానులు ఇంటిలో సొమ్ము పోయిందని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. క్లూ కోసం వారి ఇంట్లో సోదా చేయగా ఈ లెటర్ వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడులోని మేఘ్నాపురం శాంతనకుళం రోడ్డులో నివాసం ఉంటోన్న రిటైర్డ్ టీచర్ దంపతులు చిత్తిరై సెల్విన్‌, ఆయన భార్య నివాసం ఉంటున్నారు. వీరు ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్డ్‌ అయ్యారు. వీరికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం కావడంతో వారంతా తలోచోట వేరు వేరు ఊళ్లలో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు సెల్విన్ చెన్నైలో ఉండటంతో జూన్‌ 17న భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని కుమారుడిని చూసేందుకు వెళ్లారు. 9 రోజుల తర్వాత అంటే జూన్ 26న వీరు తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. ఊరెళ్లిన సమయంలో ఇంటిని చూసుకునేందుకు సెల్వి అనే మహిళను కాపలాగా ఉంచారు. దీంతో సోమవారం సాయంత్రం సెల్వి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా ఆ ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించింది.. వెంటనే యజమానులకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. దీంతో చెన్నై నుంచి వచ్చిన చిత్తిరై సెల్వన్‌ ఇంట్లోని బీరువా చూడగా.. అందులో ఉన్న రూ.60 వేల నగదు, బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించాడు.

చేసేదిలేక స్థానిక పోలీసులకు చిత్తిరై సెల్వన్‌ ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూ కోసం ఇల్లంతా పరిశీలించగా.. వారికి ఓ లెటర్‌ దొరికింది. అది దొంగతనం చేసిన దొంగ రాసిన ఉత్తరంగా పోలీసులు గుర్తించారు. అందులో.. ‘నన్ను క్షమించండి. మా ఇంట్లో ఒకరికి ఆనారోగ్యంగా ఉన్నందున దొంగతనం చేయాల్సి వచ్చింది. నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను. అందుకే దొంగతనం చేశానని’ రాసి పెట్టాడు. సదరు లేఖను చూసిన పోలీసులు, ఇంటి యజమాని అవాక్కయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గత ఏడాది కేరళలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి మెడలో బంగారు నెక్లెస్ దొంగిలించిన ఓ దొంగ.. ఆ గొలుసు విక్రయించగా వచ్చిన నగదుతో పాటు క్షమాపణ లేఖతో తిరిగి బాలిక ఇంటి వద్ద వదిలి వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!