Modi Cabinet: 30మందితో సూపర్ కేబినెట్ ప్రకటించిన మోదీ సర్కార్.. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడులకు చోటు

మోదీ హ్యాట్రిక్‌ నినాదం నిజమైంది. వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. పూర్తిస్థాయి కేబినెట్‌తో బాధ్యతలను చేపట్టారు. కేబినెట్ ఏర్పడిన 25 రోజుల తర్వాత మోదీ ప్రభుత్వం కేబినెట్ కమిటీలను ప్రకటించింది. 30 మంది కేబినెట్ మంత్రులను వివిధ కమిటీలలో సర్దుబాటు చేసింది. రాష్ట్ర మంత్రులను కూడా 4 కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.

Modi Cabinet: 30మందితో సూపర్ కేబినెట్ ప్రకటించిన మోదీ సర్కార్.. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడులకు చోటు
Super Cabinet
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 04, 2024 | 5:08 PM

మోదీ హ్యాట్రిక్‌ నినాదం నిజమైంది. వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. పూర్తిస్థాయి కేబినెట్‌తో బాధ్యతలను చేపట్టారు. కేబినెట్ ఏర్పడిన 25 రోజుల తర్వాత మోదీ ప్రభుత్వం కేబినెట్ కమిటీలను ప్రకటించింది. 30 మంది కేబినెట్ మంత్రులను వివిధ కమిటీలలో సర్దుబాటు చేసింది. రాష్ట్ర మంత్రులను కూడా 4 కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.

అయితే రాజకీయ వ్యవహారాల కమిటీ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 12 మంది సభ్యులుగా ఉన్నారు. ఇది కేబినెట్ కమిటీలలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. దేశ రాజకీయాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలను ఈ కమిటీ ప్రతిపాదనపై కేబినెట్ తీసుకుంటుంది. భారత ప్రభుత్వం వ్యాపార కేటాయింపు నియమాలు, 1961 చట్టం ప్రకారం ఈ కమిటీలు పని చేస్తాయి. భారత రాజ్యాంగంలో కేంద్ర మంత్రివర్గం గురించి ప్రస్తావించారు. కానీ ఈ కమిటీలను పేర్కొనలేదు. అందువల్ల కేబినెట్ కమిటీలకు రాజ్యాంగ కమిటీల హోదా ఉండదు.

వ్యాపార నిబంధనల ప్రకారం కేబినెట్ కమిటీలు ఏర్పాటవుతాయి. ఈ వ్యాపార నియమం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77(3) ఈ కమిటీలు పని చేస్తాయి. ఇది కేంద్ర మంత్రి మండలి పని తీరును సులభతరం చేయడానికి, కేటాయింపు నియమాలను రూపొందించే హక్కు రాష్ట్రపతికి ఉందని పేర్కొంది. దీని కింద కేబినెట్‌లో అపాయింట్‌మెంట్, సెక్యూరిటీ, పొలిటికల్, పార్లమెంటరీ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గ్రోత్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఏ కమిటీలో ఏ మంత్రులు ఉండాలో ప్రధాని నిర్ణయిస్తారు.

రాజకీయ వర్గాల్లో, ఈ కమిటీని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ కమిటీ దేశ రాజకీయాలు, అంతర్గత వ్యవహారాలలో ముసాయిదాలను సిద్ధం చేస్తుంది. సెంట్రల్ సెక్రటేరియట్ ప్రకారం, కేంద్ర, రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ పనిచేస్తుంది. సమాఖ్య వ్యవస్థ కారణంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల మధ్య సమన్వయం ఏర్పరచి పథకాలను అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ విధి. ఇది కాకుండా, ఏదైనా రాజకీయ లేదా ఆర్థిక సమస్య దేశానికి అంతర్గతంగా హాని కలిగిస్తుందా లేదా అని కూడా ఈ కమిటీ చూస్తుంది. అంతేకాకుండా, ఈ కమిటీ విదేశాలకు సంబంధించిన విధాన విషయాలను అంచనా వేయడానికి కూడా బాధ్యత వహిస్తుంది.

సెంట్రల్ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈసారి రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు. వీరితో పాటు చిన్న పరిశ్రమల శాఖ మంత్రి జితన్‌రామ్‌ మాంఝీ, షిప్పింగ్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌, విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, మహిళా అభివృద్ధి శాఖ మంత్రి అనుపూర్ణా దేవి, పార్లమెంటరీ మంత్రి కిరణ్‌ రిజిజు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే, కమిటీలో గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఇద్దరు చొప్పున, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, అరుణాచల్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్, రాజస్థాన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులు ఉన్నారు. బీజేపీ కోటా నుంచి 10 మందికి, ఇద్దరు కూటమి భాగస్వాములకు కమిటీలో చోటు కల్పించారు. నిర్మలా సీతారామన్, గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవ్య, ప్రహ్లాద్ జోషిలకు ఈసారి కమిటీలో చోటు దక్కలేదు.

కేబినెట్‌లోని మొత్తం ఎనిమిది కమిటీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను 6 కమిటీల్లో చేర్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు, ఆరోగ్య మంత్రి జెపీ నడ్డా కేవలం రెండు కమిటీలలో మాత్రమే ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కమిటీలో వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు చోటు దక్కింది. రోడ్డు నిర్మాణ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని 5 కమిటీల్లో చేర్చారు. గృహనిర్మాణం, రాజకీయ, ఆర్థిక, నైపుణ్యం, వృద్ధికి సంబంధించిన కమిటీలలో గడ్కరీని చేర్చారు. జేడీయూ కోటా నుంచి మంత్రిగా పనిచేసిన లాలన్ సింగ్‌కు ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించారు. టీడీపీకి చెందిన కే రామ్మోహన్ నాయుడు రాజకీయ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇక చిరాగ్ పాశ్వాన్‌ను ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గ్రోత్ కమిటీలో స్థానం కల్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…