Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాల ప్రకారం మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. పిల్లలను అమ్మడం లేదా కొనడం క్రూరమైన నేరంగా భావిస్తారు. జీరో ఎఫ్‌ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించే అవకాశం ఉంది.
దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాల ప్రకారం మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. పిల్లలను అమ్మడం లేదా కొనడం క్రూరమైన నేరంగా భావిస్తారు. జీరో ఎఫ్‌ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించే అవకాశం ఉంది. కొత్త చట్టాల ప్రకారం ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. పోలీసుస్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వేగవంతమైన ఫిర్యాదు ద్వారా అదే వేగంతో పోలీసులు తగిన చర్యలు తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలో సమన్లు జారీ చేయవచ్చు. దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు పేపర్ వర్క్‌ను తగ్గిస్తుంది.
లైంగిక దాడి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోనే ఒక మహిళా పోలీసు అధికారి రికార్డు చేయాలి. వారం రోజుల్లోగా వైద్య నివేదిక రావాలి. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి. ఏదైనా కేసులో నిందితులు, బాధితులు 14 రోజుల్లోగా ఎఫ్‌ఐఆర్, పోలీసు రిపోర్టు, చార్జిషీట్, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందవచ్చు.క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. విచారణ ప్రారంభమైన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి.కేసు విచారణలో అనవసర జాప్యాలను నివారించేందుకు, సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.సాక్షుల భద్రతను, వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.