Watch Video: పూజ కోసం పొడవాటి కర్రను ఇంట్లోకి తెస్తున్న వ్యక్తి క్షణాల్లో మృతి.. దడపుట్టిస్తున్న వీడియో!

ఇంటికి సమీపంలో హైటెన్షన్‌ ఓల్టేజ్‌ వైర్లు ఉండటం ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. ఇంట్లోకి పొడవాటి కర్ర తీసుకెళ్తున్న ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబాలో గత మంగళవారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Watch Video: పూజ కోసం పొడవాటి కర్రను ఇంట్లోకి తెస్తున్న వ్యక్తి క్షణాల్లో మృతి.. దడపుట్టిస్తున్న వీడియో!
Man Carrying Bamboo Stick Gets Electrocuted
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2024 | 4:30 PM

లక్నో, జులై 4: ఇంటికి సమీపంలో హైటెన్షన్‌ ఓల్టేజ్‌ వైర్లు ఉండటం ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. ఇంట్లోకి పొడవాటి కర్ర తీసుకెళ్తున్న ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబాలో గత మంగళవారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో మంగళవారం మధ్యాహ్నం తన బంధువుల ఇంట్లో మత పరమైన కార్యక్రమం జరుగుతుండగా.. ఓ వ్యక్తి పొడవైన వెదురు కర్రను ఇంట్లోకి తీసుకువెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే అతడు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న హై టెన్షన్ వైర్‌ను ఆ కర్ర తాకింది. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని దేవేంద్ర (35)గా గుర్తించారు. విద్యుదాఘాతం ధాటికి దేవేంద్ర పక్కనే ఉన్న గేటుపై పడటంతో అతడి తల బలంగా గేటుకు తలిగిలింది. అనంతరం అతడు నేలపై అచేతనంగా పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు పరుగున వచ్చి అతడి కాళ్లు, చేతులు రుద్దుతూ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు.

జసోదా నగర్‌కు చెందిన సువేంద్ర సింగ్ ఇంట్లో మంగళవారం పూజా కార్యక్రమం జరిగింది. దీంతో చందోన్ గ్రామానికి చెందిన దేవేంద్ర ఈ కార్యక్రమం కోసం బంధువుల ఇంటికి వచ్చాడు. పూజా తంతులో భాగంగా జెండా కట్టేందుకు పొడవైన వెదురు కర్రను ఇంట్లోకి తెచ్చేందుకు ప్రయత్నించిన క్రమంలో ఇంటి బయట ఉన్న హై టెన్షన్ వైర్‌కు ఆ కర్ర తగిలి క్షణాల్లో మృతి చెందాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు తడిగా ఉన్న కర్ర హై టెన్షన్ వైర్‌ను తాకడంతో ఈ సంఘటన జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తమ ఇంటి మీదగా ప్రమాదకరంగా ఉన్న హై టెన్షన్ వైర్‌లను తొలగించాలని విద్యుత్‌ శాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. వారు సమయానికి స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకుని ఉంటే దేవేంద్ర బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ షాకింగ్‌ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?