AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bridge Collapses: బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో వరుసగా ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయ్‌!

బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలడంతో ఈ విషయం కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా సివాన్‌ జిల్లాలోని గండకి నదిపై నిర్మించిన మరో వంతెన బుధవారం ఉదయం కూలిపోయింది. దీంతో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 6 బ్రిడ్జిలు కూలినట్లైంది. జిల్లాలోని డియోరియా బ్లాక్‌లో ఉన్న ఈ చిన్న వంతెన అనేక గ్రామాలను..

Bridge Collapses: బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో వరుసగా ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయ్‌!
Another Bridge Collapses In Bihar
Srilakshmi C
|

Updated on: Jul 03, 2024 | 6:05 PM

Share

బీహార్‌, జులై 3: బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలడంతో ఈ విషయం కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా సివాన్‌ జిల్లాలోని గండకి నదిపై నిర్మించిన మరో వంతెన బుధవారం ఉదయం కూలిపోయింది. దీంతో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 7 బ్రిడ్జిలు కూలినట్లైంది. జిల్లాలోని డియోరియా బ్లాక్‌లో ఉన్న ఈ చిన్న వంతెన అనేక గ్రామాలను కలుపుతుంది. వంతెన కూలిపోవడానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డిప్యూటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ తెలిపారు.

‘బుధవారం ఉదయం డియోరియా బ్లాక్‌లోని వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. బ్రిడ్జి కూలడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకూ తెలియరాలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వంతెన 1982-83లో నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గండకి నది ఉధృతంగా పారుతోంది. ఈ క్రమంలో దీనిపై ఉన్న వంతెన కూలే అవకాశం ఉన్నట్లు స్థానికులు భావించారు. అనుకున్నట్లే ఈ ఉదయం కుప్పకూలింది. రాష్ట్రంలో 15 రోజుల వ్యవధిలో ఇది ఆరో బ్రిడ్జ్‌ కావడం గమనార్హం. సివాన్‌ జిల్లాలో 11 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. జూన్‌ 22న సివాన్‌ జిల్లాలో చిన్న వంతెన ఒకటి కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్‌ బ్లాక్స్‌లోని రెండు గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ చాలా యేళ్ల క్రితం నాటిదని, కెనాల్‌లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్‌ ముకుల్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

జూన్‌ 29న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఆ తర్వాత జూన్‌ 27న కిషన్‌బాగ్‌ జిల్లాలో, జూన్‌ 23న తూర్పు చంపారన్‌ జిల్లాలో, జూన్‌ 22న సివాన్‌లో, జూన్‌ 19న అరారియాలో ఇలాగే వంతెనలు వరుసగా కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో మౌలిక సదుపాయాల స్థితిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సంఘటనలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.