Dengue: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. 50 శాతం శాంపిల్స్‌లో పాజిటివ్‌‌గా నిర్ధారణ

పూణె నగరం నుంచి మొత్తం 100 నమూనాలు ఎన్‌ఐవీకి వచ్చాయి. వీరిలో 50 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డెంగ్యూ వైరస్‌లో మొత్తం నాలుగు సెరోటైప్‌లు ఉన్నాయి. NIV ప్రకారం చాలా కేసులు డెంగ్యూ-2 సెరోటైప్ గా నిర్ధారణ అవుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. టెస్ట్ కోసం వస్తున్న శాంపిల్స్ లో సగం శాంపిల్స్‌లో డెంగ్యూ పాజిటివ్‌గా నమోదయ్యాయని.. రానున్న రోజుల్లో ఈ వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Dengue: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. 50 శాతం శాంపిల్స్‌లో పాజిటివ్‌‌గా నిర్ధారణ
Dengue Cases In India
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2024 | 4:58 PM

వర్షాకాలం వచ్చేసింది. వేడి నుంచి ఉపశమనంతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తెస్తుంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దేశంలో డెంగ్యూ జ్వరం డేంజర్ బెల్స్ మ్రోగిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) శాస్త్రవేత్తలు డెంగ్యూ జ్వరం వ్యాప్తిని తెలుసుకోవడానికి నమూనా పరీక్షలను నిర్వహించారు. పూణె నగరం నుంచి మొత్తం 100 నమూనాలు ఎన్‌ఐవీకి వచ్చాయి. వీరిలో 50 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డెంగ్యూ వైరస్‌లో మొత్తం నాలుగు సెరోటైప్‌లు ఉన్నాయి. NIV ప్రకారం చాలా కేసులు డెంగ్యూ-2 సెరోటైప్ గా నిర్ధారణ అవుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. టెస్ట్ కోసం వస్తున్న శాంపిల్స్ లో సగం శాంపిల్స్‌లో డెంగ్యూ పాజిటివ్‌గా నమోదయ్యాయని.. రానున్న రోజుల్లో ఈ వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

NIVలోని డెంగ్యూ, చికున్‌గున్యా విభాగానికి చెందిన డాక్టర్ అనురాధ త్రిపాఠి మాట్లాడుతూ.. డెంగ్యూ, చికున్‌గున్యా పరీక్షల కోసం ప్రతి సంవత్సరం NIV సాధారణంగా పూణే, గోవా, తెలంగాణ, UP , బీహార్ నుంచి 4,000 నుంచి 5,000 నమూనాలను స్వీకరిస్తుంది. జూన్‌లో దాదాపు 100 శాంపిల్స్‌ను పరీక్షించగా కనీసం 50 శాతం మందిలో డెంగ్యూ వైరల్ ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు.

పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ప్రకారం ఈ ఏడాది 487 అనుమానిత డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వాటిలో 157 జూన్‌లో నమోదయ్యాయి. డేటా ప్రకారం పది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పూణేతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడే డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రానున్న రోజుల్లో కేసులు పెరుగుతాయా?

రానున్న రోజుల్లో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు వచ్చేశాయని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. వర్షం తర్వాత పలు ప్రాంతాల్లో నీరు చేరుతోంది. ఇలా నీరు నిల్వ ఉండడం వలన డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. డెంగ్యూ లార్వా నిలకడగా ఉన్న నీటిలో వృద్ధి చెందుతుంది. ఈ దోమ కుట్టిన వారికీ డెంగ్యూ సోకుతుంది. డెంగ్యూ కేసులు జూలై నుంచి సెప్టెంబర్ వరకు నమోదవుతాయి.

వర్షం ఎంత ఎక్కువగా కురిస్తే డెంగ్యూ ముప్పు అంతగా పెరుగుతుందని డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు..వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వారిలో డెంగ్యూ తీవ్రమైన లక్షణాలుంటాయి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఇది ప్రాణాంతకం కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్య సిబ్బంది.

డెంగ్యూ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే

  1. పొడవాటి చేతులున్న దుస్తులు ధరించండి
  2. ఇంటి లోపల లేదా వెలుపల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
  3. రాత్రి సమయంలో దోమతెర ఉపయోగించాలి
  4. రెండు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే