బెస్ట్ ఇండియన్ ఫుడ్ లిస్టులో హైదరాబాదీ బిర్యానీ.. చెత్త రేటెడ్ ఆహారంపై విమర్శలు..
తాజాగా "ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల" జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది. ఇది "ప్రపంచంలోని టాప్ 16 డైరీ డ్రింక్స్ లిస్ట్ లో కూడా ఉంది" ఇక మరోవైపు భారతీయ ఆహారంలో చెత్త రేటింగ్ ను పొందిన వంటకాల్లో జాబితాలో మొదటి ప్లేస్ లో జీరా వాటర్ ఉంది. ఈ "చెత్త రేటెడ్ ఇండియన్ ఫుడ్స్" జాబితాను చూసి భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఫుడ్ విషయంలో రేటింగ్ నిజమేనా అంటూ ప్రశ్నలు లేవనేత్తుతున్నారు.
భారతీయులు భోజన ప్రియులు. భిన్నమైన ఆహార రుచులతో కూడిన వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. మన ఆహారానికి విదేశీయులు కూడా ఫిదా.. ఈ నేపధ్యంలో టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వంటకాలు.. ఆ వంటలకు రేటింగ్ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. తాజాగా “ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల” జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది. ఇది “ప్రపంచంలోని టాప్ 16 డైరీ డ్రింక్స్ లిస్ట్ లో కూడా ఉంది”. మరోవైపు హైదరాబాదీ బిర్యానీ ఏడాది తర్వాత మళ్లీ 6వ స్థానాన్ని దక్కించుకుంది. శాఖాహారం, మాంసాహార వంటకాలు, పానీయాలు రెండింటినీ కలిగి ఉన్న ప్రసిద్ధి చెందిన ఫుడ్ లిస్టు లో మసాలా టీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక బటర్ గార్లిక్ నాన్ 3వ స్థానంలో ఉంది. 4వ ప్లేస్ లో అమృతసరి కుల్చా, బటర్ చికెన్ 5వ, షాహీ పనీర్ 7వ, చోలే భతురే 8వ, తందూరి చికెన్ 9వ ప్లేస్ లో ఉండగా 10వ స్థానాన్ని కుర్మా దక్కించుకుంది. ఇలా అత్యధిక రేటింగ్ పొందిన ఆహారాలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. ఇవి దేశ విదేశాల్లోని రెస్టారెంట్‌లలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.
ఇక మరోవైపు భారతీయ ఆహారంలో చెత్త రేటింగ్ ను పొందిన వంటకాల్లో జాబితాలో మొదటి ప్లేస్ లో జీరా వాటర్ ఉంది. ఈ జీరా వాటర్ ను వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం తీసుకుంటారు. ఇది అసిడిటీ, గుండెల్లో మంట వంటి వ్యాధుల నివారణకు వంటింటి చిట్కాలలో జీరా వాటర్ ఒకటి. చెత్త వంటల్లో రెండవ స్థానాన్ని అనుభవపూర్వక ట్రావెల్ గైడ్ ‘గజక్’కి ఇచ్చింది, దీనిని ఎక్కువగా శీతాకాలంలో తినడానికి ఇష్టపడతారు. అదే జాబితాలో, ‘కొబ్బరి అన్నం’ 3వ స్థానంలో, పంతా భట్ 4వ స్థానంలో, బంగాళదుంప వంకాయ కూర 5వ స్థానంలో, తండై 6వ స్థానంలో అచ్చప్పం అంటే గులాబీ పువ్వులు 7వ స్థానంలో, బిర్యానికి రుచిని అందించే మిర్చి కా సలాన్ 8వ స్థానంలో, మల్పువా 9వ స్థానంలో, ఉప్మా 10వ స్థానంలో నిలిచాయని ఒక జాబితాను టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసింది.
ఈ “చెత్త రేటెడ్ ఇండియన్ ఫుడ్స్” జాబితాను చూసి భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఫుడ్ విషయంలో రేటింగ్ నిజమేనా అంటూ ప్రశ్నలు లేవనేత్తుతున్నారు. చెత్త ఇండియన్ ఫుడ్ లిస్టు భయంకరంగా ఉందని అంటున్నారు. ఎక్కువ మంది టేస్ట్ అట్లాస్ కంపెని విశ్వసనీయతను ప్రశ్నించారు. @ahsaassy గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన నటి అహ్సాస్ చన్నా తాజాగా ఈ ఫుడ్ రేటింగ్ పై స్పందిస్తూ టేస్ట్ అట్లాస్ తాజా పోస్ట్ పై దీన్ని ఎవరు రేటింగ్ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఈ జాబితాను ప్రశ్నిస్తున్నది ఒక్క అహ్సాస్ చన్నా మాత్రమే కాదు, చాలా మంది ఫుడ్ బ్లాగర్లు చెత్త రేట్ చేసిన వంటకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రముఖ దక్షినాది ఇండియన్ ఫుడ్ బ్లాగర్ సాబు జస్టిస్ ఫర్ అచ్చప్పం అని వ్యాఖ్యానించారు. జ్యూరిచ్‌కు చెందిన తమిళ-ఇటాలియన్ జంట ప్రభావశీలులు మరియు @dads.of.meenakshiగా ప్రసిద్ధి చెందిన ఈ జంట “తెంగై సాదం, అచ్చప్పం, మాల్పువా చెత్త జాబితాలో ఉన్నాయా?మీరు ఇచ్చిన ఈ రేటింగ్ తో ఎందరిని బాధపెట్టారో తెలుసా అని కామెంట్ చేశారు. మరో ప్రముఖ ఫుడ్ బ్లాగర్, రెసిపీ డెవలపర్ అయిన అనూషా రాజగోపాల్ స్పందిస్తూ “దురదృష్టవశాత్తూ ఈ జాబితా అజాగ్రత్తగా తయారు చేసినట్లు తెలుస్తోంది. భారతీయుల వారసత్వ వంటకాలన్నీ ఆ చెత్త ఫుడ్ ఆహార లిస్టు లో ఉన్నాయి. భారతీయ సంస్కృతి కాలానుగుణ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తుంది. గజక్, పాంటా బాత్ వంటివి ఇందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు ఇవి చెత్త జాబితాలో పడిపోయాయి. భారతదేశం గురించి తమకు అన్నీ తెలుసునని ప్రపంచం భావించాలనుకునే సమయంలో ఇలాంటి సంఘటలు జరుగుతాయని కామెంట్ చేశారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..